Site icon HashtagU Telugu

Nithya Menon : పీరియడ్స్‌ అని చెప్పిన వారు వినలేదట – నిత్యామీనన్ కీలక వ్యాఖ్యలు

Nityamenon

Nityamenon

నిత్యామీనన్ (Nithya Menon) ఆలా మొదలైంది మూవీ తో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. సింగర్ గా, హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. పవన్ కళ్యాణ్ , ధనుష్ , నాని , నితిన్ వంటి హీరోలతో జత కట్టింది. కానీ ప్రస్తుతం మాత్రం పెద్దగా సినిమాలు లేక ఖాళీగా ఉంది. దీనికి కారణం కొత్త హీరోయిన్ల రాక ఒకటైతే..నిత్యా హైట్ కూడా ఆమెకు ఛాన్సులు లేకుండా చేయడం మరోకారణం. ఇదిలా ఉంటె తాజాగా ఓ ఇంటర్య్వూలో ఈమె షాకింగ్ విషయాలను వెల్లడించారు.

Game Changer Piracy Case : ‘ఏపీ లోకల్ టీవీ’ ఆఫీసుపై పోలీస్ రైడ్

షూటింగ్ సమయంలో మహిళలు ఇబ్బంది పడుతున్న సమస్యలు గురించి తెలపడమే కాదు తాను స్వయంగా ఇబ్బంది పడిన సందర్భాన్ని తెలియజేసింది. కొంతమంది నిర్మాతలు, దర్శకులు అనారోగ్యంతో ఉన్నా, పీరియడ్స్‌ నొప్పితో ఉన్నామని చెప్పినా పట్టించుకోరని పేర్కొంది. పీరియడ్స్‌ తో ఇబ్బంది పడుతున్నామని చెప్పినా వినిపించుకోరని, ఆరోగ్యం బాలేకపోయినా, ఎంత కష్టమైనా ఏదో ఒకటి చేసి షూటింగ్‌కి రావాలని సినిమా నిర్మాత దర్శకులు కోరతారని, ఇండస్ట్రీలో మహిళలు ఇలా అలవాటు పడ్డారని నిత్యా మీనన్‌ పేర్కొంది. అయితే దర్శకుడు మిస్కిన్‌‌ను ఇందులోంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె తెలిపింది. నాకు పీరియడ్స్‌ ఉందని మొదటిసారిగా ఒక మగ దర్శకుడికి నోరు విప్పి చెప్పానని, దానిపై దర్శకుడు మిస్కిన్‌‌ సానుకూలంగానే స్పందించారని నిత్యా మీనన్‌ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిత్యా చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.