Samantha Inspired: ఆ పుస్తకాలు నాలో స్ఫూర్తిని నింపాయి: సమంత

వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత తనకు నచ్చిన పుస్తకాల గురించి షేర్ చేసుకుంది.

  • Written By:
  • Updated On - April 10, 2023 / 05:56 PM IST

టాలీవుడ్ (Tollywood) లో వైవిధ్యమైన కథలకు కేరాఫ్ అడ్రస్ సమంత (Samantha). అందుకే ఆమె నుంచి ఓ బేబీ, యశోద, శాకుంతల లాంటి డిఫరెంట్ సినిమాలు వచ్చాయి. అంతేకాదు.. ఫ్యామిలీ మేన్ లాంటి వెబ్ సీరిస్ లో నటిస్తోంది సామ్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత తనకు నచ్చిన పుస్తకాల గురించి షేర్ చేసుకుంది. పుస్తకాలను (Books) తన జీవితానికి ఎలా అన్వయించుకుంటానోని చెప్పింది.

‘‘నాకు ముందునుంచి పుస్తకాలు చదవడం అలవాటు. వాటిల్లో రొండా బర్న్ రాసిన ‘ది సీక్రెట్’ బుక్ అంటే చెప్పలేనంత ఇష్టం. అది చదివిన తర్వాత నాలో (Samantha) పాజిటివ్ పెరిగింది. కష్టకాలంలో ఎలా సానుకూలంగా ఆలోచించాలో నేర్పింది. ఇక ఆ బుక్ తర్వాత  హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ రాసిన ‘విల్’ అనే పుస్తకం చాలా ఇష్టం. ఆ పుస్తకం నా జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. విజయాలు, పరాజయాలు ఎలా స్వీకరించాలో నేర్పింది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలో ధైర్యాన్నిచ్చింది. ఇలాంటి వాటిని చదివినప్పుడు.. నేను ఇంకా ఎక్కువ కష్టపడాలి? ఆ ఆలోచనాల విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? అనేది అర్ధమవుతోంది’’ అని సమంత చెప్పింది.

చెన్నై లో పుట్టిన సమంతా రూత్ ప్రభు టాలీవుడ్ హీరోయిన్ గా ఎదిగింది. టీనేజీలోనే ఈమె మోడలింగ్‌లో కెరీర్ మొదలుపెట్టింది.ఈమె తండ్రి తెలుగు తల్లిది తమిళనాడులోని పల్లవరం జిల్లా. పల్లవరంలోని సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూలు, చెన్నైలోని హోలీ ఏంజెల్స్ సెకండరీ స్కూళ్ళలో సమంత విద్యాభ్యాసం కొనసాగింది. చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీనుండి బీకాం పట్టా అందుకుంది ఈ అందాల భామ. గౌతం మీనన్ దర్శకత్వంలో 2010 లో విడుదలైన “ఏ మాయ చేసావే ” ద్వారా సమంత (Samantha) సినిమా కెరీర్ మొదలయ్యింది. ఆ తర్వాత అనేక టాలీవుడ్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ పేరు సంపాదించుకుంది.

Also Read: Halle Berry Nude Pose: 55 ఏళ్ల వయసులో న్యూడ్ ఫొటోషూట్.. అమెరికన్ నటిపై రెచ్చిపోయిన ట్రోలర్స్!