హీరో నాని అనగానే సహజమైన కథలు గుర్తుకువస్తాయి. ప్రేక్షకుల అభిరుచి మేరకు డిఫరెంట్ మూవీస్ ను చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఈ నేచరల్ హీరో శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎమోషనల్ డ్రామాకి హాయ్ నాన్న టైటిల్ ని కన్ఫర్మ్ అయ్యింది. అధికారికంగా కొత్త పోస్టర్ తో పాటు టీజర్ విడుదల చేశారు. అయితే నాని ఇక్కడో ఓ చిన్న ట్విస్టు ఇచ్చారు. నాన్న అని పిలిచేది స్టిల్ లో ఉన్న చిట్టి తల్లి కాదని, పక్కనున్న అందమైన అమ్మాయని హింట్ ఇచ్చేశాడు. అంటే ఈ ముగ్గురి బాండింగ్ కు సంబంధించి కీలకమైన మలుపు చెప్పేశారు.
పాప తల్లి వేరు, ఆమె దూరమయ్యాక వచ్చే యువతే మృణాల్ ఠాకూర్ అనే క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 21 హాయ్ నాన్న ప్యాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది. దసరా మూవీ తర్వాత హీరో కొత్త మేకోవర్ కోరుకున్నాడు. దానికి తగ్గట్టే నాన్నగా మారిపోయాడు. జెర్సీలో పదేళ్ల కుర్రాడికి తండ్రిగా నటించి ఎమోషన్ తో కన్నీళ్లు పెట్టించిన న్యాచురల్ స్టార్ ఈసారి వినోదానికి పెద్ద పీట వేయబోతున్నట్టు తెలిసింది.
విజయ్ దేవరకొండతో ఖుషితో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న హేశం అబ్దుల్ వహాబ్ దీనికి సంగీతం సమకూరుస్తున్నాడు. మ్యూజిక్ విషయంలోనూ భారీ అంచనాలున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న నానికి ఇది ఖచ్చితంగా మరో పెద్ద బ్రేక్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూల్ టైటిల్ తో మొత్తానికి కుటుంబ ప్రేక్షకులను మరోసారి టార్గెట్ చేశాడు హీరో నాని. హాయ్ డాడీ, హల్లో నాన్న లాంటి సినిమా పేర్లు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. దీంతో నాని కూడా హాయ్ నాన్న అంటూ పలుకరించబోతున్నాడు.
Also Read: AP Minister Botsa: చూచి రాతలు, కుంభకోణాలు.. తెలంగాణ విద్యావ్యవస్థపై మంత్రి బొత్స కామెంట్స్