Site icon HashtagU Telugu

Mega156: మెగాస్టార్ చిరంజీవి 156 టైటిల్ ఇదే

Mega156

Mega156

Mega156: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ట మల్లిది (బింబిసార ఫేమ్) రాబోయే సోషియో-ఫాంటసీ చిత్రం (మెగా 156) కోసం చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్ ఇటీవల అందర్నీ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. పూజా కార్యక్రమంలో భాగంగా ఓ  టైటిల్‌గా సెట్ చేసినట్టు తెలుస్తోంది.

అయితే ఈ విషయాన్ని అధికారికంగా రివీల్ చేయాల్సి ఉంది. ప్రతిభావంతులైన MM కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ప్రస్తుతానికి ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి మెగా అభిమానులు అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి సినిమాకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ ను తెలుసుకునేందుకు తెగ ఎగ్జైట్ అవుతున్నారు.

గూగుల్ లో సెర్చ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఓవైపు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. మరోవైపు నటీనటుల ఎంపిక కూడా జరగుతోంది. ఈక్రమంలోనే ఓ అదిరిపోయే అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. Mega 156 సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Mobile Phone Effects: మొబైల్ ఫోన్ అతిగా వాడితే మగతనం మటాష్, లేటెస్ట్ సర్వేలో సంచలన విషయాలు