Site icon HashtagU Telugu

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ తో డేటింగ్ వార్తలపై స్టార్ సింగర్ రియాక్షన్ ఇదే

Mrunal Thakur Is A Dentist Age Also Revealed

Mrunal Thakur Is A Dentist Age Also Revealed

Mrunal Thakur: నటి మృణాల్ ఠాకూర్ పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీపావళి సందర్భంగా బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు, వీడియోలే ఇందుకు కారణం. ఆ ఫోటోల్లో సింగర్ బాద్షా అనే గాయకుడిని ముద్దుపెట్టుకుంటూ కనిపించింది. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని జోరుగా ప్రచారం సాగింది. దీపావళి సందర్భంగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసింది. మృణాల్, సింగర్ బాద్షా హాజరయ్యారు. మృణాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో శిల్పాశెట్టి, బాద్షాతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు.

‘నాకు ఇష్టమైన వ్యక్తులు’ అని క్యాప్షన్ ఇచ్చారు. పార్టీ అయ్యాక కూడా ఇద్దరూ దగ్గరుండి చూసుకున్నారు. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై సింగర్ స్పందించారు. ఇప్పుడు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదంటూ ఫన్నీ ఎమోజీని పోస్ట్ చేశాడు.  ఈ బాద్షా ఎవరు అంటే బాలీవుడ్ గాయకుడు, నటుడు కూడా.

అతని అసలు పేరు ఆదిత్య ప్రతీక్ సింగ్. తను పాడిన మొదటి పాటతోనే అత్యధిక వ్యూస్ సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా మరోవైపు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలను మృణాల్ ఖండించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ, నానితో సినిమాలతు చేస్తోంది.