Site icon HashtagU Telugu

Mahesh Babu: గుంటూరు మూవీకి మహేశ్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ ఇదే

Super Star Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu: భారీ అంచనాలతో వచ్చిన ఈ గుంటూరు కారం.. యాక్షన్, నవ్వులతో ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాత్రి 1 గంట నుంచి ‘గుంటూరు కారం’ సందడి మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గుంటూరు కారం దెబ్బ తింటోంది. ఎన్నో అంచనాలతో వచ్చిన గుంటూరు కారం సినిమాకు డివైడెడ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. ముఖ్యంగా అభిమానులు, సినీ ప్రేమికులు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే అదే సమయంలో సంక్రాంతికి మూడు రోజుల పాటు బుకింగ్స్‌తో కలెక్షన్లకు లోటు ఉండదనే భావన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం మహేష్‌కి అసలు ఎంత ఇచ్చారనేది మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మహేష్ కు అరవై కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. గుంటూరు కారం హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా 22 కోట్లకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విధంగా నిర్మాత కోలుకున్నాడని అంటున్నారు. అలాగే ఈ సినిమా మొదటి రోజు 40 కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇప్పటికే 20 కోట్లు సెటిల్ అయ్యాయి. మిగిలిన టిక్కెట్ల నుంచి మరో ఇరవై కోట్లు రాబోతున్నాయి. ఈ మూడు రోజుల్లో ఈ సంక్రాంతి పండుగ 80 కోట్లకు చేరుకుంటుందని అంచనా. సినిమాకు కొంత టాక్ వస్తేనే ఈ లెక్కలు వేస్తారని, టాక్ మరీ ఎక్కువైతే ఈ లెక్కలు కుదరవని అంటున్నారు. అయితే ఈ ట్రేడ్ లెక్కలు ఎంత వరకు నిజమో మరో ఇరవై నాలుగు గంటల్లో తేలిపోనుంది.

Also Read: TTD: తిరుమలలో భద్రతా లోపం, డ్రోన్‌ ఎగురవేసిన భక్తులు