ఓజీ డైరెక్టర్ కు పవన్ కార్ ఇవ్వడం వెనుక అసలు కథ ఇదే !

పవన్ కళ్యాణ్ ఓజీ డైరెక్టర్ సుజీత్ కు గిఫ్ట్ ఇవ్వడం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ గిఫ్ట్స్ ఇవ్వడం కామన్..కానీ ఇంత కాస్లీ కార్ గిఫ్ట్ ఇవ్వడం అది కూడా EMI లో తీసుకోని మరి ఇవ్వడం ఏంటి అని అంత మాట్లాడుకుంటున్నారు.

Published By: HashtagU Telugu Desk
Pawan Gift

Pawan Gift

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. తన తాజా చిత్రం ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) దర్శకుడు సుజీత్‌కు అత్యంత ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును పవన్ బహుమతిగా ఇవ్వడం వెనుక ఉన్న అసలు కారణం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం సినిమా పట్ల సుజీత్‌కు ఉన్న అంకితభావాన్ని గుర్తించిన పవన్, అతని త్యాగానికి ప్రతిఫలంగా ఈ ఖరీదైన కానుకను అందించినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. ‘OG’ చిత్రంలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను జపాన్ నేపథ్యంలో చిత్రీకరించాలని సుజీత్ భావించారు. అయితే, బడ్జెట్ పరిమితుల కారణంగా నిర్మాత దానికి అంగీకరించలేదు. కానీ, సినిమా నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకూడదని నిర్ణయించుకున్న సుజీత్, ఆ సీన్ల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఎవరూ ఊహించని పని చేశారు. తన సొంత కారును అమ్ముకుని, ఆ వచ్చిన డబ్బుతో జపాన్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. సినిమా కోసం ఒక దర్శకుడు తన వ్యక్తిగత ఆస్తులను సైతం వదులుకోవడమనేది అందరినీ ఆశ్చర్యపరిచింది.

 ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, సుజీత్ ప్యాషన్‌కు ముగ్ధుడయ్యారు. ఒక యువ దర్శకుడు సినిమా పట్ల చూపిస్తున్న నిబద్ధతను గౌరవిస్తూ, అతను కోల్పోయిన కారుకు బదులుగా అదే మోడల్‌కు చెందిన అత్యాధునిక ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును స్వయంగా కొని గిఫ్ట్‌గా ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, పవన్ కళ్యాణ్ పెద్ద మనసును మరియు సుజీత్ డెడికేషన్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

  Last Updated: 18 Dec 2025, 09:25 PM IST