Site icon HashtagU Telugu

Salaar Movie: సలార్ కు గ్రాఫిక్స్ దెబ్బ.. రిలీజ్ పై నో క్లారిటీ!

Salaar Delay

Jagapathi Babu Interesting comments on Prabhas Salaar Movie

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సాలార్’ విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘సాలార్‌’ సినిమా ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా. అది నిరవధికంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఎందుకు వాయిదా పడింది అనే విషయంపై క్లారిటీ వచ్చింది. ఇంతకీ కారణం ఏంటో తెలుసా.. తాజా సమాచారం ప్రకారం గ్రాఫిక్స్ వర్క్ లేకపోవడం వల్లే ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతోంది.

ఈ సినిమాలో గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉండటంతో పూర్తి చేయడంలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. సాధారణంగా సినిమా గ్రాఫిక్ వర్క్ రిలీజ్ డేట్ అంటే ఒక నెల ముందే పూర్తి చేయాలి. ఎందుకంటే మళ్లీ అందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే విడుదలకు ముందే చేయాలి కాబట్టి ఈ గ్రాఫిక్ వర్క్ అంతా కూడా నెలల ముందే జరిగిపోతుంది. అయితే ఇప్పుడు ఈ ‘సాలార్’ సినిమాకు వస్తున్న ఈ గ్రాఫిక్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు.

గ్రాఫిక్ టీమ్ కంటిన్యూగా వర్క్ చేస్తున్నప్పటికీ.. ఈ నెల 15వ తేదీనే వర్క్ చేయనున్నామని, అయితే మళ్లీ అందులో కరెక్షన్స్ చేస్తే రిలీజ్ కు ముందు కుదరదని చిత్ర యూనిట్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. చిత్రం. ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీయా రెడ్డి, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు నటిస్తున్నారు. అయితే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి సినిమాలు కూడా వాయిదా పడుతూ రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ ప్యాన్స్ ఈ సినిమా ఫలితంపై ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Shocking: మంత్రిపై పసుపు చల్లాడు, ఆపై సీఎంకూ వార్నింగ్ ఇచ్చాడు!

Exit mobile version