Site icon HashtagU Telugu

Saidharam Tej: సాయిధరమ్ తేజ్ పంచెకట్టు వెనుక అసలు కారణం ఇదేనట

Article Recovered Recovered

Article Recovered Recovered

Saidharam Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పంచెకట్టు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. సాయిధరమ్ తేజ్ సాంప్రదాయ లుక్‌లో కనిపించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కొత్త లుక్ వెనుక కారణం ఏంటనేది ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. కేవలం ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో మాత్రమే పంచెకట్టులో కనిపించే అతడు.. ఇటీవల ప్రతీ ఇంటర్వ్యూ, ఈవెంట్‌లోనూ పంచెకట్టుకుని కనిపిస్తున్నాడు. దీంతో ఈ విషయం ఆసక్తికరంగా మారింది.

సాయిధరమ్ తేజ్ ఇంతలా పంచెకట్టులో కనిపించడానికి కారణం ఏంటనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది సినీ సర్కిల్స్‌లో పెద్ద అంతుచిక్కని ప్రశ్నలా మారిపోయింది. ఇటీవల ఆహాలో ప్రసారమైన అన్‌స్టాఫబుల్ విత్ ఎన్‌బీకే షోలో కూడా సాయిధరమ్ తేజ్ పంచెలో కనిపించాడు. అన్‌స్టాఫబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 2లో పవన్ కల్యాణ్ గెస్ట్ గా వచ్చాడు. ఇందులో మధ్యలో పవన్‌కు తోడు సాయిధరమ్ తేజ్ కూడా యాడ్ అయ్యాడు.

ఈ సందర్భంగా పంచెకట్టులో సాయిధరమ్ తేజ్ వచ్చాడు. అక్కడ నుంచి ప్రతీ ఫంక్షన్‌లోనూ పంచెకట్టులోనే కనిపిస్తున్నాడు. ప్రస్తుతం వీరూపాక్ష సినిమాతో సాయిధరమ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏప్రిల్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను అతడు షూరూ చేశాడు. వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, యూట్యూబ్ స్టార్ తో చిట్‌చాట్లో బిజీగా ఉన్నాడు.

ఈ ఇంటర్వ్యూలలో ఎక్కడ చూసినా పంచెకట్టులోనే సాయిథరమ్ తేజ్ కనిపిస్తున్నాడు. దీంతో దీనికి కారణం ఏంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. పంచెకట్టు వెనుక ఏదో రీజన్ ఉందని అంటున్నారు. మరి ఆ రీజన్ ఏంటనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందేనని అంటున్నారు.

Exit mobile version