Game Changer Story: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer Story). ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కియరా అద్వానీ కథనాయికగా నటిస్తోంది. వీరితో పాటు ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎస్‌జే సూర్య, నటులు శ్రీకాంత్, సునీల్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, హీరోయిన్ అంజలి, తదితరులు నటించారు.
గేమ్ ఛేంజర్ స్టోరీ ఇదే
సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే డిసెంబర్ 21వ తేదీన డల్లాస్ వేదికగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఫుల్ వీడియోను ఈరోజు సోషల్ మీడియా వేదికగా నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో మాట్లాడిన శంకర్ సినిమా స్టోరీ ఇదే అంటూ ఒక కథ చెప్పారు.
Also Read: Mann Ki Baat: నాగేశ్వర రావు గురించి మాట్లాడిన మోడీ.. థ్యాంక్స్ చెప్పిన నాగార్జున
శంకర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది పొలిటికల్ టచ్‌తో పాటు కమర్షియల్ యాంగిల్ కూడా ఉంది. ఒక ఐఏఎస్ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగే సన్నివేశాలే గేమ్ ఛేంజర్ మూవీ స్టోరీ అని శంకర్ లైన్ చెప్పేశారు. అయితే ఈ మూవీలో చరణ్ కాలేజీ ఎపిసోడ్‌లో గడ్డంతో కనిపిస్తారని, ఐఏఎస్ పాత్రలో చాలా డీసెంట్ లుక్‌లో ఉంటారని, ఫ్లాష్ బ్యాక్‌లో నటన అద్భుతంగా ఉంటుందని శంకర్ చెప్పారు. దీంతో ఈ మూవీపై మెగా అభిమానులు అంచనాలు పెంచుకున్నారు. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్‌ను జనవరి 1వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ఈరోజు విజయవాడలో జరిగిన రామ్ చరణ్ భారీ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రకటించారు. అంతేకాకుండా తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ రానున్నట్లు స్పష్టం చేశారు. దీంతో మెగా అభిమానులు సంతోషంలో మునిగిపోతున్నారు. ఒకే వేదికపై బాబాయ్- అబ్బాయ్‌ని చూడబోతున్నామని సంబరపడిపోతున్నారు.