Site icon HashtagU Telugu

Rajamouli Secret: రాజమౌళి బ్లాక్ బస్టర్ సినిమాలు తీయడానికి అసలు సీక్రెట్ ఇదే!

Rajamouli

Rajamouli

టాలీవుడ్ విజయవంతమైన దర్శకుడు ఎవరు? అనగానే చాలామందికి వెంటనే దర్శక ధీరుడు రాజమౌళికి గుర్తుకువస్తారు. ఆయన స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఇప్పటి ఆర్ఆర్ఆర్ వరకు వరుసగా ఎన్నో విజయాలను చవిచూశారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఎంతోమందిని స్టార్స్ ను చేశాయి. ఎన్నో అవార్డులు తెచ్చాయి. అందుకే రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి టాలీవుడ్‌లో విన్నింగ్ కాంబినేషన్‌గా నిలిచారు.

అయితే వారి విజయాల వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఏదైనా మూవీని తెరకెక్కించే ముందు ఈ ఇద్దరు కథ చర్చలో పాల్గొంటారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకుంటారు. అందువల్ల స్క్రిప్ట్ మరింత మెరగవుతుంది. అంతేకాదు.. స్టోరీ డిస్కషన్స్ తో ఏమైనా లోపాలు, బలాలు ఉంటే తెలియజేయడానికి వారి వద్ద ఓ గ్రూపు కూడా ఉంది. 30 మంది సభ్యులు ఉన్న గ్రూపులో యువకులు, అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్లలో 20 ఏళ్ల కుర్రకారు ఉండటం విశేషం.

“రాజమౌళి స్క్రిప్ట్‌ను రూపొందించే ప్రక్రియలో వివిధ సన్నివేశాలు, క్యారెక్టర్ ఆర్క్స్, కీలకాంశాలు గురించి టీమ్ చర్చిస్తున్నప్పుడు రాజమౌళి నిశ్శబ్దంగా వింటారు. మరోవైపు,ప్రసాద్ కథా చర్చలలో పాల్గొంటారు. ఎవరైనా తమ ఆలోచనలను షేర్ చేసినప్పుడు రాజమౌళి నవ్వుతూ రియాక్ట్ అవుతన్నారు. సలహాలు నచ్చితే వెంటనే ఓకే చెబుతారు” అని గ్రూప్ లోని ఓ వ్యక్తి చెప్పారు. “దర్శకులు దాసరి నారాయణరావు, కె. విశ్వనాథ్‌లు రచయితలతో చర్చలు జరిపి వారి స్క్రిప్ట్‌లను చక్కగా తీర్చిదిద్దారు. రచయితలు తెరవెనుక లాజిక్‌ను ప్రశ్నించడాన్ని వారు పట్టించుకోలేరు’’ అని సీని విమర్శకులు సైతం చెబుతారు. కథాంశాలలో కొత్తదనం లేకపోతే రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్‌లు కూలంకషంగా చర్చించి బౌండ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటారు. తద్వారా బ్లాక్‌బస్టర్స్ ను కొడుతారు.

Also Read: Dengue Cases: డెంగ్యూ యమ డేంజర్.. హైదరాబాద్ లో కేసుల కలకలం, డాక్టర్లు అలర్ట్!