Site icon HashtagU Telugu

Salaar Movie Twitter Review: సలార్ మూవీ ట్విట్టర్ రివ్యూ ఇదే.. మూవీ ఎలా ఉందంటే..?

Salaar Movie Twitter Review

Prabhas Salaar Release In 2

Salaar Movie Twitter Review: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా సలార్. ట్విట్టర్‌లో ‘సలార్’ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ (Salaar Movie Twitter Review) వస్తుంది. అందరూ అనుకున్నట్టుగానే ప్రభాస్‌కి ఇది మాస్ కమ్ బ్యాక్ అంటూ అటు అభిమానులు, ఇటు సినిమా చూసిన నెటిజన్లు ట్విట్టర్ లో ట్వీట్ లు పెడుతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ ప్రభాస్‌కి ఇచ్చిన ఎలివేషన్లు చూస్తుంటే మతి పోయిందంటూ ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతున్నారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని అంటున్నారు. మరి సినిమా గురించి సినిమా చూసిన అభిమానులు ట్విట్టర్‌లో ట్వీట్ లు పెడుతూ సినిమా ఎలా ఉందో చెప్తున్నారు.

ఎన్నో అంచనాల మధ్య సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. తెలంగాణలో రాత్రి నుంచి షోలు పడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఆహా ఇది ఊచకోత కాదయ్యా.. రాచకోత. రాజమౌళిని బోయపాటిని మిక్సీలో వేసి తీసినట్లున్నాయ్ ఫైట్స్. కేజీఎఫ్‌ను మించి సినిమా ఉందయ్యా అంటూ థియేటర్‌లో నుంచి వస్తున్న ఫ్యాన్స్ చెప్పుకొచ్చాడు. ప్రభాస్‌తో ఉన్న యాక్షన్ సీన్స్ అన్నీ వేరే లెవల్లో ఉన్నాయంటూ మరో యూజర్ పోస్ట్ చేశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ ఒక్కటి చాలు థియేటర్లో సీట్లు చింపేయడానికంటూ రాసుకొచ్చాడు.

Also Read: British girl: చెస్ లో చరిత్ర సృష్టించిన ఎనిమిదేళ్ల బ్రిటీష్ విద్యార్థిని

https://twitter.com/ssmb_freaks/status/1737982125532749886?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1737982125532749886%7Ctwgr%5Ebc291102a87c199ede18504e233ea871eadda4cd%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fprabhas-salaar-twitter-review-and-audience-response%2Farticleshow%2F106194770.cms

ఇందులో పూర్తిగా ప్ర‌భాస్ వ‌న్ మ్యాన్ షో అని అభిమానులు చెప్పుకుంటున్నారు. మొత్తానికి ట్విట్టర్ ఆడియన్స్ ను మాత్రం ఒక ఊపు ఊపేస్తోంది సలార్. ఇక ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి.. కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. 1000 కోట్లు లోడింగ్ అంటూ.. ఇప్పటికే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు ప్యాన్స్. ఈ మూవీలో ప్రభాస్ తో పాటు శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితరులు నటించారు. మరి సినిమా ఎలా ఉందో తెలియాలంటే కాసేపు ఆగాల్సిందే.