Site icon HashtagU Telugu

IndiGo : ఇదొక ర‌క‌మైన వేధింపు ..మంచు లక్ష్మి

Manchu Lakshmi attends ED interrogation

Manchu Lakshmi attends ED interrogation

Manchu Laxmi : ఇండిగో విమానయాన సంస్థ ప్రవర్తించిన తీరుపై మంచు లక్ష్మీ మండిపడ్డారు. ఈ సంస్థలోని సిబ్బంది ప్రయాణికులతో ప్రేమగా ఉండరని, దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే తాను ఇండిగో విమానంలో ప్రయాణించగా.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. తనపట్ల సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా వరుస ట్వీట్లు పెట్టారు.

ఆ సంస్థ‌కు చెందిన ఫ్లైట్‌లో ప్ర‌యాణించిన‌ప్పుడు సిబ్బంది త‌న‌తో దురుసుగా ప్రవర్తించారు. తన లగేజీ బ్యాగ్‌ను పక్కకు తోసేసినట్లు చెప్పారు. బ్యాగ్‌ ఓపెన్‌ చెయ్యడానికి కూడా అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. సిబ్బంది చెప్పినట్లు వినకపోతే తన బ్యాగ్‌ను గోవాలోనే వదిలేస్తామని బెదిరించినట్లు చెప్పారు. ఇదో రకమైన వేధింపులు అంటూ ఫైర్‌ అయ్యారు. తన కళ్లెదుటే సెక్యూరిటీ ట్యాగ్‌ కూడా వేయలేదని.. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్‌ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా..? అని ప్రశ్నించారు. ఈ విధంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారు.? అంటూ నిలదీశారు. మరికొందరు ప్రయాణికుల విషయంలో కూడా ఇలానే చేశారని, ఇదొక రకమైన వేధింపు అని సంస్థపై ఆమె మండిపడ్డారు.

కాగా, మంచు లక్ష్మి ఇండిగో సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. వారి పనితీరును విమర్శిస్తూ అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో పర్సు మర్చిపోవడంతో ఇండిగో సిబ్బందిని సాయం అడగ్గా.. వారు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నట్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

Read Also: Hinduism : హిందువులు ఈ మాంసాన్ని అస్సలు తినకూడదు..!