Richest Bollywood Family : బాలీవుడ్‌లో నంబర్ 1 ధనిక ఫ్యామిలీ ఏదో తెలుసా ?

Richest Bollywood Family : బాలీవుడ్‌‌లో అత్యంత ధనిక ఫ్యామిలీ ఏది ? అని ఎవరినైనా అడిగితే.. కొందరు హీరోలు, హీరోయిన్ల పేరు చెప్పడం మొదలుపెడతారు.

  • Written By:
  • Updated On - April 25, 2024 / 09:02 AM IST

Richest Bollywood Family : బాలీవుడ్‌‌లో అత్యంత ధనిక ఫ్యామిలీ ఏది ? అని ఎవరినైనా అడిగితే.. కొందరు హీరోలు, హీరోయిన్ల పేరు చెప్పడం మొదలుపెడతారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి వారి పేర్లు చెబుతారు. కానీ వీరెవరూ బాలీవుడ్‌లో నంబర్ 1 ధనికులు కాదు. వీరందరిని మించిన రేంజులో సంపద ఓ వ్యక్తి దగ్గర ఉంది. ఆయనకు దాదాపు రూ.10వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని అంచనా.  ఇంతకీ ఎవరా బాలీవుడ్ నంబర్ 1 సంపన్నుడు ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

చాలామంది బాలీవుడ్‌లో కపూర్ కుటుంబం దగ్గర ఎక్కువ ఆస్తులు ఉన్నాయని భావిస్తుంటారు. కానీ ఆ ఫ్యామిలీ దగ్గర రూ.1,000 కోట్ల ఆస్తులే ఉన్నాయి. కరణ్ జోహార్ కుటుంబం దగ్గర కూడా రూ. 1,700 కోట్ల ఆస్తులే ఉన్నాయి. అమీర్ ఖాన్ నికర ఆస్తులు రూ. 1,862 కోట్లు కాగా, సల్మాన్ ఖాన్ నికర ఆస్తులు రూ. 2,900 కోట్లు. షారుక్ ఖాన్ దగ్గర కూడా రూ. 6,000 కోట్ల ఆస్తులే ఉన్నాయి. యశ్ రాజ్ ఫిల్మ్స్ యజమాని ఆదిత్య చోప్రా ఫ్యామిలీ దగ్గర రూ.7,000 కోట్ల ఆస్తులే ఉన్నాయి. కానీ ఓ బాలీవుడ్ ఫ్యామిలీ దగ్గర ఏకంగా రూ.10వేల కోట్ల ఆస్తులున్నాయి. అది మరెవరో కాదు.. టీసిరీస్ గుల్ష‌న్ కుమార్ ఫ్యామిలీ(Richest Bollywood Family) !!

Also Read : Balakrishna Vs Paripoornananda : పరిపూర్ణానంద ఎంట్రీ.. బాలయ్య ఇలాఖాలో ట్రయాంగిల్ ఫైట్ ?

  • టీ సిరీస్ మ్యూజిక్ లేబుల్ కంపెనీ అధినేత  గుల్ష‌న్ కుమార్.
  • గుల్ష‌న్ కుమార్ చనిపోయాక వార‌సుడు భూషణ్ కుమార్ కుటుంబ ఆస్తుల‌ను విపరీతంగా పెంచారు.
  • భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించిన పలు భారీ సినిమాలు అసాధార‌ణ విజ‌యాల్ని అందుకున్నాయి.
  • ప్రస్తుతం టీ సిరీస్ మ్యూజిక్ లేబుల్ కంపెనీకి  భూషణ్ కుమార్ ఛైర్మన్‌‌గా ఉన్నారు.
  • ‘హురున్ ఇండియా రిచ్ సెల‌బ్ లిస్ట్ 2022’ ప్రకారం.. భూషణ్ కుమార్ కుటుంబం వద్ద దాదాపు రూ. 10,000 కోట్ల నికర ఆస్తులు ఉన్నాయి.
  • భూషణ్ కుమార్ వద్ద వ్యక్తిగతంగా 414 కోట్ల రూపాయల ఆస్తులే ఉన్నాయని అంటారు.
  • నటి దివ్య ఖోస్లా కుమార్‌ను భూషణ్ కుమార్ పెళ్లి చేసుకున్నారు. ఆమెకు కూడా టి-సిరీస్ కంపెనీలో 0.45 శాతం వాటా ఉంది.
  • టి-సిరీస్ ఛైర్మన్ భూషణ్ కుమార్‌కు అతడి బాబాయ్ క్రిషన్ కుమార్ (మాజీ నటుడు గుల్షన్ కుమారుడు సోదరుడు) వ్యాపారంలో సహాయం చేస్తుంటారు.
  • భూషణ్ కుమార్‌ ఓ సోదరి ఖుషాలి నటి. మరో సోదరి తులసి కుమార్ బాలీవుడ్‌లో గాయని. వీరిద్దరికి కూడా కంపెనీలో వాటాలు ఉన్నాయి.