Site icon HashtagU Telugu

Rakul Preet Marriage: బాలీవుడ్ లో మోగనున్న పెళ్లిభాజాలు.. త్వరలో రకుల్ పెళ్లి!

Rakul

Rakul

నటీనటులు రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ రిలేషన్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియా పేర్కొంటున్న విషయం తెలిసిందే. తమ సంబంధాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లడానికి ఈ జంట సిద్దంగా ఉంది. అవును మీరు చదివింది నిజమే! బాలీవుడ్‌లోని ఆరాధ్య జంటల్లో ఒకరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని రకుల్ సోదరుడు అమన్ క్లారిటీ ఇచ్చాడు. తన సోదరి 2023లో  పెళ్లి చేసుకోబోతున్నట్టు అమన్ వెల్లడించాడు. అయితే, రకుల్, ఆమె ప్రియుడు జాకీ ఇద్దరూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

రకుల్ గత సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్‌లో జాకీతో తన సంబంధాన్ని తెలియజేసింది. అక్టోబర్ 2021లో రకుల్ జాకీ చేతులు పట్టుకుని ఉన్న అందమైన ఫోటోను షేర్ చేసింది. తన సంబంధాన్ని ప్రకటిస్తూ  ఇలా రాసింది, “థాంక్యూ ! మీరు ఈ సంవత్సరం నా అతిపెద్ద బహుమతి! నా జీవితానికి రంగులమయం చేసినందుకు ధన్యవాదాలు. @jackkybhagnani కలిసి మరిన్ని జ్ఞాపకాలను పంచుకుంటున్నా” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.