Site icon HashtagU Telugu

Naga Chaitanya : హైలెస్సో.. తండేల్ నుంచి మరో సాంగ్ రెడీ..!

Third Song From Naga Chaitanya Thandel Release Update

Third Song From Naga Chaitanya Thandel Release Update

Naga Chaitanya అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా తండేల్. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆల్రెడీ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. సినిమా నుంచి వచ్చిన బుజ్జి తల్లి సాంగ్ చార్ట్ బస్టర్ కాగా.. శివ శివ సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు సినిమా నుంచి థర్డ్ సాంగ్ కి టైం అయ్యింది.

ఫిబ్రవరి 7న రిలీజ్ అవబోతున్న తండేల్ సినిమా నుంచి నెక్స్ట్ హైలెస్సో సాంగ్ రిలీజ్ కాబోతుంది. హైలెస్సో హైలెస్సా అంటూ రాబోతున్న ఈ సాంగ్ జనవరి 23న రిలీజ్ చేయబోతున్నారు. తండేల్ నుంచి రాబోతున్న థర్డ్ సాంగ్ గా ఈ సాంగ్ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దేవి మార్క్ మెలోడీ సాంగ్ గా ఇది వస్తుందని అంటున్నారు.

తండేల్ సినిమా నుంచి వచ్చిన బుజ్జి తల్లి సాంగ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ తో రికార్డులు సృష్టిస్తుంది. ఇక రాబోతున్న సాంగ్స్ కూడా సినిమాపై మరింత క్రేజ్ తెచ్చేలా చేస్తున్నాయని చెప్పొచ్చు. చందు మొండేటి నాగ చైతన్య ఈ సినిమాని చాలా ఫోకస్ తో చేస్తున్నట్టు తెలుస్తుంది. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా చైతన్య కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ సినిమాగా వస్తుందని తెలుస్తుంది.