Site icon HashtagU Telugu

Balakrishna : బాలయ్య సినిమాలో మళ్లీ ఆమె ఎంట్రీ.. సెంటిమెంట్ కోసమేనా..?

3 Titles for Balakrishna KS Bobby Super Plan

3 Titles for Balakrishna KS Bobby Super Plan

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారని తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ మూవీస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. వీర మాస్ టైటిల్ ప్రచారం ఓ ఉన్న ఈ సినిమాలో ఆల్రెడీ శ్రద్ధ శ్రీనాథ్ (Sraddha Srinath) హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ అందాల భామ ఊర్వశి రౌతెలా కూడా ఒక ఇంపార్తెంట్ రోల్ లో నటిస్తుంది.

ఐతే ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా కూడా సినిమాలో మరో హీరోయిన్ ను తీసుకుంటున్నారని లేటెస్ట్ టాక్. ఆల్రెడీ బాలకృష్ణతో నటించిన హీరోయిన్ నే మళ్లీ ఈ సినిమా కోసం రిపీట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇంతకీ బాలయ్యతో ఛాన్స్ అందుకున్న ఆ హీరోయిన్ ఎవరంటే ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) అని తెలుస్తుంది. అమ్మడు కెరీర్ లో పెద్దగా ఫాంలో లేదు. చివరగా బాలకృష్ణతోనే అఖండ చేసింది ప్రగ్యా.

మళ్లీ ఇన్నాళ్లకు అది కూడా బాలకృష్ణ (Balakrishna) సినిమాతోనే చాన్స్ అందుకుంది. అఖండ సెంటిమెంట్ తోనే ప్రగ్యాని కావాలని ఈ సినిమాలో తీసుకున్నారా ఏంటై ఆడియన్స్ నుకుంటున్నారు. బాబీ డైరెక్షన్ లో సినిమా అంటే మాస్ ఆడియన్స్ కు పండుగ అన్నట్టే లెక్క. ఈ సినిమాలో కూడా మాస్ ప్రేక్షకులు కోరే అన్ని అంశాలు ఉంటాయని అంటున్నారు.

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ అఖండ 2 (Akhanda 2) సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు. బోయపాటి శ్రీను ఆల్రెడీ స్క్రిప్ట్ సిద్ధం చేయగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తుంది. ఈసారి అఖండ 2 ని పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ని మెప్పించేలానే ఈ కథ సిద్ధం చేశాడట బోయపాటి శ్రీను. వేరే హీరోలకు ఏమో కానీ బాలయ్యతో బోయపాటి శ్రీను ట్రాక్ రికార్డ్ అదిరిపోయింది కాబట్టి అఖండ 2 పాన్ ఇండియా హిట్ కొట్టినా డౌట్ పడక్కర్లేదని అంటున్నారు.

Also Read : Hardik Pandya Future: ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా పాండ్యా కొన‌సాగుతాడా..?