Celebrity Guests : ఆ పెళ్లిళ్లకు వెళితే కాసుల వర్షమే.. నాగార్జున కామెంట్స్‌కు అనంత్ అంబానీ పెళ్లితో లింక్ ?

Celebrity Guests : డబ్బున్న వాళ్ల ఇళ్లలో జరిగే పెళ్లి వేడుకల గురించి నాగార్జున ఒక పాత ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Huge Expectations on Nagarjuna Role in Coolie Movie

Huge Expectations on Nagarjuna Role in Coolie Movie

Celebrity Guests : డబ్బున్న వాళ్ల ఇళ్లలో జరిగే పెళ్లి వేడుకల గురించి నాగార్జున ఒక పాత ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆనాడు నాగార్జున చేసిన కామెంట్స్‌ను ఇప్పుడు గుజరాత్‌లోని జామ్ నగర్ వేదికగా జరుగుతున్న ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలతో ముడిపెట్టి చూస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది ? చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

ఓ మీడియా సంస్థకు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో నాగార్జున కీలకమైన అంశాన్ని లేవనెత్తారు. వ్యాపార దిగ్గజులు, ప్రముఖుల పెళ్లి వేడుకలకు సెలబ్రిటీలు ఎందుకు క్యూ కడతారు ? వారికి, వీరికి ఏమిటి సంబంధం ? అభిమానులను అస్సలు పట్టించుకోని సెలబ్రిటీలు.. వ్యాపార ప్రముఖులు నిర్వహించే వేడుకలకు మాత్రం ఎందుకు హాజరవుతారు ? అనే డౌట్స్ చాలామందికి వస్తుంటాయి. వాటికి సమాధానం ఇచ్చేలా నాగార్జున ఆ ఇంటర్వ్యూలో చక్కగా మాట్లాడారు. ఏమన్నారంటే.. ‘‘పెళ్లిళ్లకు డబ్బులిచ్చి తీసుకొస్తుంటే ఏం చెప్తాం. మా పెళ్లిళ్లకు రండి మేం డబ్బులిస్తాం అంటున్నారు’’ అని అప్పట్లో నాగార్జున కామెంట్ చేశారు. ‘‘నాకు కూడా అలాంటి ఆహ్వానాలు వచ్చాయి. వచ్చి 20 నిమిషాలు ఉండి వెళ్లిపోండి అనే వాళ్లు. కానీ వాటిని నేను ఎంటర్‌టైన్ చేయలేదు.  ఎందుకంటే నాకు అలాంటి వేడుకలకు వెళ్లడం నచ్చదు’’ అని ఆయన  క్లారిటీ ఇచ్చారు. అలాంటి వేడుకలకు వెళితే ఎంత రెమ్యునరేషన్ ఇస్తారని నాగార్జునను అడగగా.. ‘‘అది చెప్పలేం. కచ్చితంగా చాలా డబ్బులే ఇస్తారనుకుంటా. హిందీ స్టార్లకు, వేరేవాళ్లకు  కోటి రూపాయల దాకా ఇచ్చారట. నాకు తెలియదు. మన తెలుగువాళ్లకైతే అంత ఇవ్వకపోయినా కచ్చితంగా ఎంతోకొంత ఇస్తారు’’ అని ఇంటర్వ్యూలో వివరించారు.

Also Read : March To May : ఎండలపై ఐక్యరాజ్యసమితి వార్నింగ్.. ఏం చెప్పిందో తెలుసా ?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్నకొడుకు అనంత్ అంబానీ పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల పెళ్లికి ఇంకా టైం ఉన్నా.. ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఇటీవల మూడు రోజుల పాటు గుజరాత్‌లోని జామ్ నగర్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందుకు రూ.1000 కోట్లు ఖర్చయ్యాయనే ప్రచారం జరుగుతోంది. ఈ వేడుకలకు వచ్చిన బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీల(Celebrity Guests) లిస్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వేడుకలకు హాజరు కావడానికి కూడా స్టార్లకు రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారనే డౌట్ అందికీ వస్తోంది. ఈనేపథ్యంలో హీరో నాగార్జున పాత ఇంటర్వ్యూ వీడియో వైరల్ కావడం కొత్త చర్చకు దారితీసింది.

Also Read :Khammam: ఖమ్మంలో నామా చరిత్ర సృష్టిస్తాడా? కేసీఆర్ నమ్మకం నిలబెట్టేనా..

  Last Updated: 05 Mar 2024, 03:30 PM IST