Site icon HashtagU Telugu

Poonam Kaur Clarity: పూనమ్ పిల్లల సీక్రెట్!

Poonam

Poonam

తన వ్యక్తిగత జీవితంలో చాలా ఒత్తిడికి గురయ్యానని నటి పూనమ్ కౌర్ అన్నారు. ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా అవకాశాల్లో కొంచెం వెనుకబడినా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది. పూనమ్ కౌర్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ఫోటోను పోస్ట్ చేసింది. అయితే ఆ ఫొటోలో ఆమె ఇద్దరు పిల్లలను ప్రేమగా కౌగిలించుకోవడం చూడొచ్చు. పిల్లలు ఆమె కూతుళ్లు కావచ్చునని కొందరు కామెంట్స్ చేయగా, మీరు రహస్యంగా పిల్లలకు జన్మనిచ్చారా? అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు.

అక్కడితో ఆగకుండా పూనమ్ పై ట్రోలింగ్ కు దిగారు నెటిజన్స్. సీక్రెట్ గా పెళ్లి చేసుకొని, ఇద్దరి పిల్లలకు తల్లి అయ్యిందనే వార్తలపై పూనమ్ రియాక్ట్ అయ్యింది. పిల్లలు తన బెస్ట్ ఫ్రెండ్ కూతుళ్లు ఆమె స్పష్టం చేసింది. ‘‘ఫొటో వల్ల చాలా డ్యామేజ్ అయ్యింది. వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ పిల్లలు. సోషల్ మీడియాకు ధన్యవాదాలు, నేను క్లారిటీ ఇచ్చాను. ఇక నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి’’ అంటూ ట్వీట్ చేసింది.