Tollywood Movies: ఈ వారం థియేటర్లలో సినిమాల జాతర.. ఒకే రోజు ఏకంగా అన్ని సినిమాలు విడుదల!

సంక్రాంతి పండుగ తర్వాత మళ్లీ ఈ వారం థియేటర్ల వద్ద సినిమాల జాతర మొదలుకానుంది. ఒకేరోజు ఏకంగా వరుసగా సినిమాలు విడుదల కాబోతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Mixcollage 05 Feb 2024 07 54 Am 9811

Mixcollage 05 Feb 2024 07 54 Am 9811

సంక్రాంతి పండుగ తర్వాత మళ్లీ ఈ వారం థియేటర్ల వద్ద సినిమాల జాతర మొదలుకానుంది. ఒకేరోజు ఏకంగా వరుసగా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒక తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఈ వారం డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమాతో పాటు రజనీకాంత్ సినిమా అలాగే మరికొన్ని సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. మరి ఈ వారం థియేటర్ల వద్ద ఏఏ సినిమాలు పోటీ పడబోతున్నాయి అన్న వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ఈగల్.

ఇందులో కావ్య తాపర్,అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. అలాగే నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలకపాత్రలలో నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న గ్రాండ్గా విడుదల కాబోతోంది. అలాగే విష్ణు విశాల్ , విక్రాంత్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా లాల్ సలామ్ సినిమా కూడా ఫిబ్రవరి 9న విడుదల కాబోతోంది. ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో రజినీకాంత్ అతిథి పాత్ర పోషించాడు. స్పోర్ట్స్ డ్రామా చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇందులో లివింగ్‌స్టన్, సెంథిల్, జీవిత, KS రవికుమార్, తంబి రామయ్య కీలకపాత్రలు పోషించారు.

అలాగే ఫిబ్రవరి 9న విడుదల కాబోతున్న సినిమాలలో ట్రూ లవర్ సినిమా కూడా ఒకటి. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో మణికందన్, గౌరీప్రియ, నిఖిలా శంకర్ నటించారు. ఆరేళ్ల ప్రేమ తర్వాత ప్రేమికులిద్దరూ విడిపోయారు. చివరికి ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో జయం రవి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం సైరన్. ఈ చిత్రంలో నటి అనుపమ పరవేశ్వరన్, కీర్తి సురేష్ నటించారు. కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. సైరన్ ఫిబ్రవరి 16న థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమాలలో రవితేజ నటించిన ఈగల్ సినిమాపై ప్రస్తుతం భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం మాస్ మహారాజా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

  Last Updated: 05 Feb 2024, 07:55 AM IST