Site icon HashtagU Telugu

Movie Celebrities : ఈ స్టార్స్ కి తండ్రి ఒకరే.. కానీ తల్లి వేరు.. కొంతమందికి తల్లి ఒకరే.. కానీ తండ్రి వేరు..

These Movie Celebrities are Brothers and Sisters but they are from Not single parents

These Movie Celebrities are Brothers and Sisters but they are from Not single parents

టాలీవుడ్(Tollywood) టు బాలీవుడ్(Bollywood) మనం కొంతమంది స్టార్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని చూస్తాము. అయితే వారిలో కొంతమంది ఒక తల్లిదండ్రులకు పుట్టిన వారు కాదు. ముందుగా మన టాలీవుడ్ గురించి మాట్లాడుకుందాం. నందమూరి కుటుంబం నుంచి ఇప్పుడు స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎన్టీఆర్(NTR) అండ్ కళ్యాణ్ రామ్(Kalyan Ram) ఎప్పుడు కలిసి ప్రేమగా కనిపిస్తూ ఉంటారు. కళ్యాణ్ రామ్ తన తమ్ముడైన ఎన్టీఆర్ ని ‘నాన్న’ అని ప్రేమగా పిలుస్తుంటాడు. అయితే వారిద్దరికీ తండ్రి ఒకరే అయినా, తల్లులు వేరు. హరికృష్ణ(Harikrishna) మొదటి భార్యకి కళ్యాణ్ రామ్ పుడితే, రెండో భార్యకి ఎన్టీఆర్ పుట్టాడు.

అలాగే అక్కినేని కుటుంబంలోని నాగచైతన్య, అఖిల్ కూడా కలిసిమెలిసి కనిపిస్తూ ఉంటారు. అయితే వీరిద్దరి తండ్రి నాగార్జున అయ్యినప్పటికీ తల్లులు వేరు. విక్టరీ వెంకటేష్ చెల్లిని నాగార్జున ఫస్ట్ మ్యారేజ్ చేసుకోగా నాగచైతన్య పుట్టాడు. ఆ తరువాత వాళ్లిదరు విడిపోగా నాగార్జున.. అమలని పెళ్లి చేసుకున్నాడు. వారికి పుట్టిన వాడే అఖిల్.

ఇక మంచు ఫ్యామిలీలోని మంచు విష్ణు, లక్ష్మి.. మోహన్ బాబు మొదటి భార్యకి పుట్టగా, ఆవిడ చనిపోతే ఇంకో పెళ్లి చేసుకున్నాడు. మంచు మనోజ్ రెండో భార్యకి పుట్టాడు. వీరందరికి తండ్రి ఒకరైనా తల్లి మాత్రం వేరు.

ఇలాగే వేరే పరిశ్రమలలో కూడానా చాలా మంది ఉన్నారు. కొంతమందికి తల్లులు ఒకరైతే తండ్రులు వేరు. ఒకప్పటి తమిళ్ స్టార్ హీరోయిన్లు అయిన జ్యోతిక అండ్ నగ్మా కూడా సిస్టర్స్. అయితే వీరిద్దరి మదర్ ఒకటే అయ్యినప్పటికీ, తండ్రులు మాత్రం వేరు. అలాగే మరో తమిళ్ స్టార్స్ అరుణ్ విజయ్ అండ్ శ్రీదేవిలకు తండ్రి ఒకటే అయ్యినప్పటికీ తల్లులు వేరు. ఇక బాలీవుడ్ లో అర్జున్ కపూర్, బోణి కపూర్ మొదటి భార్యకి పుట్టగా జాన్వీ కపూర్ రెండో భార్య శ్రీదేవికి పుట్టింది. అలాగే సారా అలీఖాన్.. సైఫ్ అలీఖాన్ మొదటి భార్యకి పుట్టగా, రెండో భార్య కరీనా కపూర్ తో మరో బిడ్డకి జన్మానించాడు. ఇలా బాలీవుడ్ లో అయితే చాలా మండే ఉన్నారు.

 

Also Read : Chiranjeevi : నేను ఆ టెస్ట్ చేయించకపోతే క్యాన్సర్ వచ్చేదేమో.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..