Bangalore Rave Party : బెంగుళూర్ రేవ్ పార్టీ కి వెళ్లిన టాలీవుడ్ ప్రముఖులు వీరే…

గత రెండు రోజులుగా ఈ పార్టీ గురించి అంత మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం ఈ పార్టీ లో టాలీవుడ్ , తెలుగు బుల్లితెర నటి నటులు పోలీసులకు చిక్కడమే.

Published By: HashtagU Telugu Desk
Bangalore Rave Party List

Bangalore Rave Party List

ఇటీవల కాలంలో రేవ్ పార్టీ (Rave Party)లు అనేవి కామన్ గా మారాయి. గుట్టుచప్పుడు కాకుండా ఇలాంటి పార్టీలు జరుపుతూనే ఉన్నారు. అయితే ఒక్కోసారి మాత్రం పోలీసుల ఎంట్రీతో ఈ పార్టీలకు భగ్నం కలుగుతుంటాయి. తాజాగా బెంగుళూర్ లో రేవ్ పార్టీ (Bangalore Rave Party)ని భగ్నం చేసారు పోలీసులు. గత రెండు రోజులుగా ఈ పార్టీ గురించి అంత మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం ఈ పార్టీ లో టాలీవుడ్ , తెలుగు బుల్లితెర నటి నటులు పోలీసులకు చిక్కడమే. ఈ పార్టీ లో పలువురు పేర్లు సైతం బయటకు వచ్చినప్పటికీ..వారెవరు కూడా ఈ పార్టీకి వెళ్లలేదని క్లారిటీ రావడం తో వారి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా పోలీసులు ఈ పార్టీకి వచ్చిన వారి పేర్లను బయటకు తెలిపారు. నటి హేమ స్నేహితుడు అయిన చిరంజీవి , అరుణ్, శివానీ జైస్వాల్, సందీప్ కొర్రపాటి, రిషి చౌదరి, డింపుల్ చౌదరి, వెంకట్ చౌదరి (గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరికి అత్యంత సన్నిహితుడు), బుల్లితెర నటి అషీరాయ్ ఈ రేవ్ పార్టీకి హాజరైనట్లుగా పోలీసులు తెలిపారు.

ఇక ఈ పార్టీకి తను వెళ్లినట్లుగా తాజాగా ఆషీ రాయ్ ఓ వీడియోను విడుదల చేసింది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి వెళ్లాను కానీ.. అది రేవ్ పార్టీ అని తనకు తెలియదని, వాసు అనే అతను బర్త్‌డే పార్టీ అని పిలిస్తే వెళ్లినట్లుగా చెప్పుకొచ్చింది. వాసు బ్రదర్ బర్త్‌డే పార్టీ అంటే వెళ్లాను తప్ప అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది నాకు తెలియదు. దయచేసి నాకు హెల్ప్ చేయండి. నేను ఒక ఆడపిల్లను. ఇప్పుడిప్పుడే కష్టపడి ఇండస్ట్రీలోకి వస్తున్నాను.. ప్లీజ్ దయచేసి నాకు హెల్ప్ చేయండి’’ అని తెలిపింది.

Read Also : Macherla : పిన్నెల్లి అనుచరుల దాడిలో గాయపడిన శేషగిరిరావుకు బాబు ఫోన్..

  Last Updated: 22 May 2024, 07:58 PM IST