Site icon HashtagU Telugu

Big Boss Season 6 : తెలుగు బిగ్ బాస్ -6 ఫైనల్ కంటెస్టెంట్లో ఎవరో తెలుసా..!!!

Bigboss Ott

Bigboss Ott

బిగ్ బాస్ రియాల్టీ షో…బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నో షోలలో ఇది ఒకటి. ఈ షోకు ఎంతో మంది సెలబ్రిటీలు సుమారు 90రోజుల పాటు బయట ప్రపంచానికి చూపించకుండా సాగుతుంది. ఈ హౌస్ లో స్కిట్లు, గేమ్స్ పెట్టి కంటెస్టెంట్లను తికమక పెడుతుంటారు. వాటన్నింటికి తట్టుకుని ఎవరైతే నిలబడుతారో వారే టైటిల్ విన్నర్ గా నిలుస్తారు.

ఈ రియాల్టీ షో ఆదివారం నుంచి గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇప్పటికే నెట్టింట్లో బిగ్ బాస్ సందడి ప్రారంభమయ్యింది. ఈ షోలో వీరే కంటెస్టెంట్లు అంటూ ఓ లిస్టు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వీరిలో 20 మంది పేర్లు బయటకు వచ్చాయి. ఇదే ఫైనల్ లిస్టు అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న లిస్టు ప్రకారం నటుడు బాలాదిత్య, కమెడియన్ చంటి, ఆర్జె సూర్య, యాంకర్ నేహా చౌదరి, సింగ్ రేవంత్, నటి సుదీప, సీరియల్ నటి శ్రీ సత్య, కీర్త , ఇనయ సుల్తానా , లేడీ కమెడియన్ ఫైమా, వసంతి, అర్జున్ , రాజశేఖర్, రోహిత్ మరీనా, గీతురాయల్, సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ ఉన్నారు. వీరితోపాటు ఇద్దరు లేదా ముగ్గురు కూడా కామనర్స్ కూడా ఈ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.

Exit mobile version