Site icon HashtagU Telugu

90s Pan India Stars: బాలీవుడ్ ను శాసించిన ‘పాన్ ఇండియా’ స్టార్స్ వీళ్లే!

Pan India

Pan India

ఇటీవల కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి సౌత్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంతో నార్త్ వర్సెస్ సౌత్ అన్నట్టుగా పరిస్థితి మారింది. దీంతో ‘పాన్ ఇండియా’ సోషల్ మీడియాలో పాన్ ఇండియా చర్చ నడుస్తోంది. ప్రభాష్, అల్లు అర్జున్, యశ్ కంటే ముందే మన సౌత్ హీరోలు బాలీవుడ్ శాసించారు. 90వ దశకంలో బి-టౌన్‌ను షేక్ చేసిన ఐదుగురు సౌత్  స్టార్స్ (వెంకటేష్, కమల్ హాసన్, అక్కినేని నాగార్జున, మమ్ముట్టి, రజనీకాంత్) గురించి తెలుసుకోవాల్సిందే.

వెంకటేష్

హాండ్సమ్ హంక్ రానా దగుబాటి బాలీవుడ్‌లో అరంగేట్రం చేయడానికి ముందు, అతని మామ వెంకటేష్ అనారీ (కరిష్మా కపూర్ ప్రధాన పాత్రలో నటించారు) తఖ్‌దీర్‌వాలా అనే రెండు హిట్‌లతో హిందీ చిత్రాలలో అడుగుపెట్టారు. ఇందులో ఖాదర్ ఖాన్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించారు.

కమల్ హాసన్

వెండితెరకు పరిచయం అవసరం లేని పేరు కమల్ హాసన్. 80వ దశకం నుండే బాలీవుడ్ పై దండయాత్ర చేశాడు. ఇతర హీరోలను వెనక్కి నెట్టి బాలీవుడ్‌ను శాసిస్తున్నాడు. రతీ అగ్నిహోత్రితో కలిసి ఏక్ దుయుజే కే లియేలో సినిమాలతో ఆకట్టుకున్నాడు. కమల్ హే రామ్, చాచీ 420, సద్మా వంటి మరిన్ని అద్భుతమైన చిత్రాలను అనేక హిందీ చిత్రాలకు కమల్ కు మంచి పేరు తెచ్చుకున్నారు.

అక్కినేని నాగార్జున

దేశంలోని అతిపెద్ద టాలీవుడ్ స్టార్‌లలో నాగార్జున ఒకరు. 90వ దశకంలో బాలీవుడ్‌లో సత్తా చాటారు. శివ, ఖుదా గవా వంటి కొన్ని వినోదాత్మక చిత్రాలలో నటించాడు. జఖ్మ్‌లో నాగార్జున నటనకు మంచి మార్కులు పడ్డాయి.

మమ్ముట్టి

మలయాళ సూపర్ స్టార్ 1993లో ధరిపుత్రతో బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు. అతను సౌ ఝూత్ ఏక్ సచ్‌లో సినిమాతో ఆకట్టుకున్నాడు.

రజనీకాంత్

దశాబ్దాలుగా భారతీయ సినిమాని శాసిస్తున్న సూపర్ స్టార్  1983లో అమితాబ్ బచ్చన్‌తో కలిసి అంధా కానూన్‌తో హిందీలోకి అడుగుపెట్టాడు. అతను జీత్ హమారీ, హమ్, ఆటంక్ హీ ఆటంక్ వంటి అనేక విజయవంతమైన హిందీ చిత్రాల్లో నటించాడు.

Exit mobile version