Thalapathy Vijay కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న G.O.A.T సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా కు సంబందించిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాని సందర్భంగా సినిమాకు అనుకున్న డేట్ నుంచి రిలీజ్ వాయిదా వేస్తున్నారని కోలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. ఐతే దీనిపై క్లారిటీ ఇచ్చారు నిర్మాతల అర్చన (Archana) కల్పతి. సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఆమె సినిమా అనుకున్న టైం కు రిలీజ్ అవుతుందని అన్నారు.
విజయ్ గోట్ సినిమాపై వస్తున్న వార్తలను ఏమి నమ్మొద్దని.. సినిమా తప్పకుండా అనుకున్న డేట్ కే వస్తుందని అన్నారు అర్చన. సినిమా వి.ఎఫ్.ఎక్స్ లేట్ వల్ల రిలీజ్ ప్రకటించిన డేట్ కు రావడం కుదరదని కొందరు చెబుతున్నారు. ఐతే అందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు అర్చన. స్టార్ సినిమాపై సెట్స్ మీద ఉన్నప్పుడు రకరకాల వార్తలు రావడం ఖాయం.
Also Read : Maharaja : మహారాజ హిందీ రీమేక్.. మిస్టర్ పర్ఫెక్ట్ మెప్పిస్తాడా..?
విజయ్ గోట్ సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ లాక్ చేశారు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు త్రిష కూడా ఈ సినిమాలో భాగం అవుతుందని తెలుస్తుంది. సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. విజయ్ గోట్ సినిమాను తెలుగులో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాను మైత్రి మూవీ మేకర్స్ తెలుగు రైట్స్ దక్కించుకున్నారని తెలుస్తుంది.
ఈ సినిమా తర్వాత విజయ్ మాక్సిమం ఒక సినిమా చేసి ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లో బిజీ అవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటికే విజయ్ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరగా సినిమాలను ఆపేసి పూర్తిస్థాయిలో పాలిటిక్స్ చేయాలని విజయ్ కూడా ఉత్సాహంగా ఉన్నాడు.