Site icon HashtagU Telugu

Shruti Haasan: ప్రేమను చూపించేవాళ్లు ఎప్పుడూ ఉంటారు..శృతిహాసన్ ఆసక్తికర ట్వీట్

Heroine Shruti Haasan Interesting Comments About Her Movies Selection Detailss

Heroine Shruti Haasan Interesting Comments About Her Movies Selection Detailss

Shruti Haasan: ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ ఎప్పుడూ ఏదోక టాపిక్‌తో వార్తల్లో ఉంటూనే ఉంటుంది. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విషయాల్లో కూడా ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పెట్టే ఫొటోలు హాట్‌టాపిక్‌గా మారుతూ ఉంటాయి. తాజాగా శృతిహాసన్ చేసిన మరో ట్వీట్ హాట్‌టాపిక్‌గా మారింది.

అపార్థం చేసుకునేవాళ్లు ఎప్పుడూ ఉంటారని అర్థమైందని శృతిహాసన్ పేర్కొంది. మంచు ప్రదేశాల్లో డ్యాన్స్ చేసేటప్పుడు హీరోయిన్స్ వాడే డ్రెస్‌లపై శృతిహాసన్ కామెంట్ చేసింది. దీనిని ఉద్దేశించి కొంతమంది నెటిజన్లు శృతిహాసన్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు. వీటికి కౌంటర్‌గా శృతిహాసన్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం తాను జీవితంలో తాను అత్యున్నత దశలో ఉన్నానని, ఎన్నో అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. ఎంతో గొప్పగా ఎదుగుడుతున్నానని, తన జీవితం ఇంత అందంగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నానంది.

వీటితో పాటు తనకు ఇంకో విషయం కూడా అర్థమైందని, మనల్ని అపార్థం చేసుకునే వాళ్లు ఎప్పుడూ ఉంటారని, అలాగే ప్రేమను చూపించే వాళ్లు కూడా ఉంటారని శృతిహాసన్ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

అయితే ప్రస్తుతం కెరీర్ పరంగా శృతిహాసన్‌కు ఎలాంటి ఢోకా లేదు. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలాగే ఆమె నటించిన సినిమాలు వరుస హిట్ అవుతున్నాయి. చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో చేసిన వీరసింహారెడ్డి సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. దీంతో కెరీర్ మంచిగా సాగుతోంది. ప్రస్తుతం పలు సినిమాలలో శృతి నటిస్తోంది.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్ మాట్లాడుతూ హీరోయిన్స్ డ్రెస్‌లపై కామెంట్ చేసింది. మంచులో డ్యాన్స్ వేయడం చాలా కష్టమైన పని అని, హీరోలు కోటు, శాలువా వంటి వేసుకుంటారంది. కానీ హీరోయిన్లకు అలాంటి అవకాశం ఉండదు కాబట్టి కేవలం చీరను ాత్రం ధరించాలని పేర్కొంది.