Site icon HashtagU Telugu

TheRajaSaab : మాస్ లుక్ తో వచ్చేసిన ‘రాజాసాబ్’

Rajasaab

Rajasaab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – మారుతీ (Prabhas-Maruthi)కలయికలో తెరకెక్కుతున్న మూవీ తాలూకా ఫస్ట్ లుక్ ను సంక్రాంతి సందర్బంగా మేకర్స్ రిలీజ్ చేసి అభిమానుల్లో సంతోషం నింపారు. ఈశ్వర్ తో హీరోగా కెరియర్ మొదలుపెట్టిన ప్రభాస్ మొదటి నుండి యాక్షన్ మూవీస్ చేస్తూ ఆకట్టుకుంటూ వస్తున్నారు. బాహుబలి తర్వాత డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రీసెంట్ గా KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

త్వరలో మారుతీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూ వస్తుంది. ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ అనుకుంటున్నట్లు ప్రచారం అవుతుంది. ఈ రోజున ఎట్టకేలకు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేసి అభిమానుల్లో అసలైన సంక్రాంతి ని తీసుకొచ్చారు. ఈ చిత్రానికి ” రాజా సాబ్” అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇక ఫస్ట్ లుక్ లో ప్రభాస్ లుంగీ పైకి ఎగడుతూ కనిపించాడు. ఈ సినిమా కామెడీ హర్రర్ జోనర్ లో తెరకెక్కుతుంది. “మూవీ టైటిల్ రాజాసాబ్.. మూవీ టీమ్ నుంచి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. త్వరలోనే రెబల్ ఎంటర్‌టైన్మెంట్ ప్రపంచవ్యాప్తంగా పేలిపోనుంది” అనే క్యాప్షన్ తో ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పీపుల్ మీడియా బ్యానర్ ఫై మీడియం రేంజ్ బడ్జెట్లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా మాళవిక మోహన్ తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తుండగా.. విలన్ గా సంజయ్ దత్తు నటిస్తున్నాడు.

Read Also : Prajapalana Update : ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చారా ? కొత్త అప్‌డేట్ ఇదే