Theme of BRO : బ్రో మూవీ నుంచి థీమ్ రిలీజ్..థమన్ మరోసారి కుమ్మేసాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ "బ్రో" (BRO).

Published By: HashtagU Telugu Desk
Theme Of Bro

Theme Of Bro

Theme of BRO : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్సాయి ధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ “బ్రో” (BRO). త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదలైన సాంగ్స్ , టీజర్ అంచనాలు రెట్టింపు చేయగా.. ఈరోజు శిల్ప కళ వేదిక లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా జరపబోతున్నారు. ఈ తరుణంలో మేకర్స్ బ్రో మూవీ థీమ్ ను విడుదల చేసి ఇంకాస్త ఆసక్తి పెంచారు. మరోసారి థమన్ కుమ్మేసాడని థీమ్ చూస్తే అర్ధం అవుతుంది. వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్స్ ను మించి ఈ బ్రో థీమ్ సాంగ్ ఉంది. కల్యాణ్ చక్రవర్తి ఈ పాటకు సాహిత్యం అందించారు. “బ్రో” అనే టైటిల్ కు లింక్ చేస్తూ ఈ సాంగ్ సాగుతుంది.

ఇక పవన్ విషయానికి వస్తే ప్రస్తుతం రాజకీయాలతో బిజీ గా ఉన్నారు. ఇటీవల రోజుల్లో ఎక్కువ సమయం రాజకీయాలకే ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా లోయితే పవన్ (Pawan Kalyan) హావ నడుస్తుంది. వారాహి (Varahi) యాత్ర తో ప్రభుత్వం (AP Govt) ఫై విరుచుకపడుతున్న పవన్..సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటూ ప్రభుత్వానికి వరుస ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాదానాలు చెప్పకుండా..జగన్ సర్కార్ పవన్ వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తుంది. ఇలాంటి సమయంలో ఈరోజు హైదరాబాద్ లో జరగబోయే బ్రో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఏ రేంజ్ లో జరగబోతుందో…పవన్ నుండి ఎలాంటి పంచులు వస్తాయో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read Also: Jayaho Kargil : జూలై 26 కార్గిల్ విజయ్ దివస్.. నాటి సైనికుల పోరాట స్ఫూర్తి నేటికీ చిరస్మరణీయం

  Last Updated: 25 Jul 2023, 01:18 PM IST