Director Manikandan కోలీవుడ్ లో డైరెక్టర్ మణికందన్ ఇంట్లో చోరీ జరిగింది. ఆయన ఇంట్లో లేని టైం చూసుకుని దొంగలు ఎంచక్కా ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. బీరువా తాళం కూడా ఓపెన్ చేసి అందులో ఉన్న లక్ష రూపాయలు.. దాదాపు ఐదు సవర్ల బంగారం తీసుకెళ్లారని తెలుస్తుంది.
ఆయన చెన్నైలో వేరే ప్లేస్ లో ఉండగా ఈ చోరీ జరిగినట్టు సమాచారం. అయితే కేవలం డబ్బులు, బంగారం మాత్రమే కాదు ఆయన జాతీయ అవార్డులను కూడా తీసుకెళ్లారని తెలుస్తుంది. మణికందన్ డైరెక్ట్ చేసిన కాక ముట్టై సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. 2015 లో రిలీజైన ఆ సినిమాకు 62వ నేషనల్ అవార్డుల్లో రెండు కేటగిరిల్లో అవార్డ్ వచ్చింది.
అయితే వాటికి సంబందించిన రజత పతకాలను సైతం దొంగలు ఎత్తుకెళ్లినట్టు తెలుస్తుంది. మణికందన్ మొదట ఫోటో గ్రాఫర్ కాగా కెరీర్ తొలి నాళ్లల్లో అసిస్టెంట్ కెమెరా మెన్ గా పనిచేశాడు. తను డైరెక్ట్ చేసిన మణికందన్ విండ్ షార్ట్ ఫిల్మ్ చూసి వెట్రిమారన్ అతనికి డైరెక్షన్ చాన్స్ ఇచ్చారు.
కాక ముట్టై తర్వాత కెరీర్ లో అంతగా దూకుడు చూపించని మణికందన్ ప్రస్తుతం విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో వస్తున్న ఒక వెబ్ సీరీస్ ని డైరెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ డిస్నీ హాట్ స్టార్ నిర్మిస్తుంది.