వెండితెర ఫై అగ్ర హీరో అనిపించుకున్న జూ. ఎన్టీఆర్ (NTR) ను ఓ మహిళ (Woman) దారుణంగా మోసం చేసిన ఘటన బయటకు వచ్చింది. ఎన్టీఆర్ 2003 లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్ని (Land) సుంకు గీత (Geetha)అనే మహిళ నుంచి కొనుగోలు చేశారు. అయితే ఆ భూమి ఫై గీత 1996లోనే బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. ఆ రుణాలు కట్టకుండానే..ఆ భూమిని ఎన్టీఆర్ కు అమ్మేసింది. అంతే కాదు ఆ భూమి ఫై రుణాలు తీసుకున్న విషయం కూడా చెప్పలేదు. దాంతో ఎస్‌బీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండ్‌స్ ఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్ కింద డెట్ రకవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాయి. విచారణ జరిపిన డీఆర్‌టీ.. ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులుంటాయంటూ తీర్పు ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో ఎన్‌టీఆర్ ఆ స్థలంతో పాటు అందులో కట్టుకున్న ఇల్లు కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. తనను మోసం చేసి భూమిని అమ్మిందని చెప్పి..ఎన్టీఆర్ కోర్ట్ ను ఆశ్రయించారు. ఎన్టీఆర్ ఫిర్యాదుతో ఆ భూమిని అమ్మిన గీతపై కేసు నమోదు చేయాలనీ ఆదేశాలు జారీ చేసారు. అదే సమయంలో డీఆర్టీ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు ఎన్టీఆర్. డీఆర్‌టీ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో సమయం కావాలని జూనియర్ ఎన్టీఆర్ తరఫు న్యాయవాది కోరారు. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్ ముందు పోస్టు చేయాలని విజ్ఞప్తి చేసినా అందుకు ధర్మాసనం నిరాకరించింది. విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. మరి జూన్ 6 న కోర్ట్ ఏ తీర్పు ఇస్తుందో చూడాలి.
Read Also : Working Women: పురుషులతో సమానంగా మహిళలు.. వేగంగా పట్టణ శ్రామిక మహిళల సంఖ్య..!