సంక్రాంతి 2026 విన్నర్ ఎవరో తేలిపోయింది.. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్‌, నవీన్‌. ?

2026 సంక్రాంతి బరిలో నిలిచిన ఐదు తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. అయితే శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్ర బృందం ‘సంక్రాంతి విన్నర్’ పేరుతో సక్సెస్ మీట్ ప్లాన్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారీ వసూళ్లతో దూసుకుపోతున్న చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఉండగా.. శర్వానంద్ మూవీ విన్నర్ టైటిల్ క్లెయిమ్ చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల సందడి […]

Published By: HashtagU Telugu Desk
Sankranthi 2026 Box Office Bonanza

Sankranthi 2026 Box Office Bonanza

2026 సంక్రాంతి బరిలో నిలిచిన ఐదు తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. అయితే శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్ర బృందం ‘సంక్రాంతి విన్నర్’ పేరుతో సక్సెస్ మీట్ ప్లాన్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారీ వసూళ్లతో దూసుకుపోతున్న చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఉండగా.. శర్వానంద్ మూవీ విన్నర్ టైటిల్ క్లెయిమ్ చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల సందడి సాగుతోంది. ఈసారి పండక్కి ఏకంగా ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిల్లో రెండు పెద్ద సినిమాలు.. మూడు మిడ్ రేంజ్ సమూవీస్ ఉన్నాయి. మూడు హిట్ టాక్ తో, ఒకటి యావరేజ్ టాక్ తో, ఇంకోటి మిక్స్డ్ టాక్ తో నడుస్తున్నాయి. ఆశ్చర్యకరంగా వీటన్నిటికీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో 2026 సంక్రాంతి విన్నర్ ఎవరు? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఓ మూవీ టీమ్ నుంచి వచ్చిన ఓ పోస్టర్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

సంక్రాంతి కానుకగా ముందుగా థియేటర్లలో విడుదలైన ‘ది రాజాసాబ్’ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ ప్రభాస్ స్టార్ డమ్ తో బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఆ తర్వాత చిరంజీవి నటించిన ‘ మన శంకర వరప్రసాద్ గారు ‘ సినిమా రిలీజైంది. దీనికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యునానిమస్ హిట్ టాక్ వచ్చింది. ఇదే క్రమంలో విడుదలైన రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలకు కూడా మంచి స్పందన లభించింది. ఇక చివర్లో వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీకి ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంది. (మీ పొట్టలో కొంచెం చోటు ఇవ్వండి.. మీ గుండెలో ఉండిపోతుంది: కోన వెంకట్ పోస్ట్ వైరల్)

శర్వానంద్ హీరోగా నటించిన సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. ఇందులో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లు. శ్రీవిష్ణు స్పెషల్ క్యామియో చేశారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి రేసులో నాలుగు సినిమాలు పోటీలో ఉన్నా, తమ మూవీపై నమ్మకంతో కాంపిటీషన్ లో జనవరి 14న రిలీజ్ చేశారు. అప్పటికే నాలుగు చిత్రాలు విడుదలవడంతో, దొరికినన్ని థియేటర్లలో సాయత్రం ఈవెనింగ్ షోలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మొదటి ఆట నుంచే ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది.

నారీ నారీ నడుమ మురారి సినిమాకి అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా పండించిన కామెడీకి జనాలు థియేటర్లలో విరగబడి నవ్వుతున్నారు. పర్ఫెక్ట్ పండగ బొమ్మ అని సినిమా చూసినవాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. అయితే మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో థియేటర్లు పెంచడమని డిమాండ్స్ వస్తున్నాయి. పడిన షోలన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించడానికి మేకర్స్ రెడీ అయ్యారు.

సంక్రాంతి విన్నర్ మీట్ పేరుతో ‘నారీ నారీ నడుమ మురారి’ టీమ్ ఇవాళ శుక్రవారం (జనవరి 16) సాయంత్రం 4 గంటలకు ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ, ‘సంక్రాంతి విన్నర్’ పేరుతో మీట్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. భారీ వసూళ్లను రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి కూడా ఇలాంటి పోస్టర్ రాలేదే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘రియల్ సంక్రాంతి విన్నర్’ ఈ సినిమానే అంటూ ఎవరికి నచ్చిన పేరు వారు చెబుతున్నారు.

సరిగ్గా ఆరేళ్ల కిందట 2020 సంక్రాంతికి మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. రెండూ హిట్ టాక్ తో భారీ వసూళ్లు రాబట్టాయి. దీంతో పోటాపోటీగా సంక్రాంతి విన్నర్ అని ఒకరు, పొంగల్ విన్నర్ అని మరొకరు పోస్టర్లు వేసుకున్నారు. మా సినిమావి రియల్ కలెక్షన్స్ అంటే, మావి ఆర్గానిక్ కలెక్షన్స్ అంటూ సోషల్ మీడియాని హీటెక్కించారు. చివరికి వాటిల్లో ఏది పైచెయ్యి సాధించిందో చెప్పాల్సిన పనిలేదు.

ట్ చేస్తే, ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ బాగానే ఆడుతున్నాయి. ‘సంక్రాంతి విన్నర్’ మీట్ అంటూ నారీ నారీ నడుమ మురారి చిత్ర బృందం సెలబ్రేషన్స్ మొదలుపెట్టింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటూ ‘అనగనగా ఒక రాజు’ టీమ్ థ్యాంక్స్ మీట్ పెట్టింది. మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర యూనిట్ పోస్టర్లు వదులుతోంది. ‘బ్లాక్ బస్టర్ సంక్రాంతి’ అని భర్త మహాశయులకు విజ్ఞప్తి టీమ్ అంటోంది. ‘కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్’ అని రాజాసాబ్ టీమ్ చెబుతోంది. మరి వీటిల్లో రియల్ సంక్రాంతి విన్నర్ ఏదని భావిస్తున్నారో కామెంట్ చేయండి.

 

  Last Updated: 16 Jan 2026, 02:39 PM IST