Site icon HashtagU Telugu

NTR30 Update: విలన్ వచ్చేశాడు.. ఎన్టీఆర్ తో బాలీవుడ్ రావణ్ డిష్యూం డిష్యూం!

Ntr 30

Ntr 30

జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR), కొరటాల శివ కాంబినేషన్ లో NTR30 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పాన్ ఇండియా (Pan India) రేంజ్ లో తెరకెక్కుతుండటం, ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కూడా ఇదే కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ షూటింగ్ కోసం హైదరాబాద్ (Hyderabad) లో అడుగుపెట్టింది. అయితే ఈ మూవీలో విలన్ ఎవరు అనేది ఇప్పటివరకు తెలియలేదు. కానీ చిత్ర యూనిట్ ఇవాళ విలన్ ఎవరో చెప్పేసింది.

బాలీవుడ్ వెర్సటైల్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ 30 (NTR30) లో విలన్ గా జాయిన్ అయ్యరని, ఎన్టీఆర్ మరియు దర్శకుడు కొరటాల శివ సైఫ్ కు స్వాగతం చెబుతున్న ఫొటోను షేర్ చేశారు. బాలీవుడ్ స్టార్ కాస్ట్ ఈ మూవీలో భాగంకావడం, దేశవ్యాప్తంగా ఎన్టీఆర్‌కి ఉన్న ఫాలోయింగ్ ఎన్టీఆర్ 30పై భారీ అంచనాలను రేపుతోంది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఉండటం మరో హైలైట్.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 5, 2024న విడుదల (Grand Release) కానుంది. గత నెలలో చిత్రీకరణ ప్రారంభించిన ఈ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ప్రాజెక్ట్ ఎడిటర్. రత్నవేలు సినిమాటోగ్రఫీని, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు.

Also Read:Siddharth’s Takkar Teaser: సెక్స్ అయితే ఓకే కానీ.. ఈ ప్రేమ, పెళ్లి వద్దు!

Exit mobile version