పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu)సినిమా నుంచి మూడో పాట(3rd Song) విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఈ పాట కోసం చిత్రబృందం ప్రత్యేకంగా ఈవెంట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’ పాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న నేపథ్యంలో, ఈ మూడవ పాటపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకోగా, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వీఎఫ్ఎక్స్, డబ్బింగ్, సౌండ్ డిజైన్ వంటి విభాగాల్లో అత్యున్నత ప్రమాణాలతో పని జరుగుతోంది. దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ ప్రతీ భాగాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ, ఈ సినిమాను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. జూన్ 12న సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Neeraj Chopra: భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు!
ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో, ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా అలరించనున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తిగా కనిపించనున్నాడు. సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా వంటి నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం. కీరవాణి అందించగా, ఛాయాగ్రాహకుడిగా మనోజ్ పరమహంస, సెట్ డిజైన్‌లో తోట తరణి పని చేశారు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునే లక్ష్యంతో, ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో మలచేందుకు చిత్ర బృందం సమర్పణలో ఎలాంటి రాజీ పడకుండా ముందుకు సాగుతోంది.