Priyanka Chopra : RRR తమిళ్ మూవీ అంటూ ప్రియాంక చోప్రా కామెంట్స్…ఓ రేంజ్‎లో కడిగిపాడేస్తున్న నెటిజన్లు.

  • Written By:
  • Publish Date - March 29, 2023 / 06:07 PM IST

RRR…తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సినిమాలోని నాటునాటు పాటకు ఒరిజినల్ బెస్ట్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఇదే కాదు ఈ మూవీ తెలుగులో తెరకెక్కిన భారతదేశంలో పలు భాషల్లో విడుదలై రికార్డులు బద్దలు కొట్టింది. విదేశాల్లో కూడా విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ కు ధీటుగా దక్షిణాదిలో స్థానిక భాషల్లో సినిమాలు తెరకెక్కుతాయన్న సంగతి వారికి తెలియదు. అందుకే రాజమౌళి దీని గురించి చెప్పే ప్రయత్నం చేశారు. బాలీవుడ్ ను కించపరచకుండానే ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా అంటూ అంతర్జాతీయ వేదికపై నొక్కి మరీ చెప్పారు.

ఈమూవీ ఆస్కార్ దక్కించుకున్నప్పటికీ విదేశీయులు అదో తెలుగు సినిమాని గుర్తించడం అంత ఈజీ కాదు. కొంత సమయం కావాలి. ఏ భాష అనేది పక్కపెడితే, విదేశీయులకు ఆర్ఆర్ఆర్ అంటే బాలీవుడ్ మూవీ అనుకున్నారు. దాన్ని తెలుగు సినిమాగా గుర్తించలేకపోయారు. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఈ విషయంలో నోరుజారడం విచారకరం.

ప్రియాంక చోప్రా అమెరికాలో ఆర్మ్ ఛైర్ ఎక్స్పర్ట్ విత్ డాక్స్ షెపర్డ్ అనే పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అక్కడివారు ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ప్రస్తావించారు. ఈక్రమంలో మాట్లాడుతున్న ప్రియాంక అది బాలీవుడ్ మూవీ అన్నారు. తప్పును సరిచేసుకుంటూ తమిళ్ మూవీ అన్నారు. ప్రియాంక వ్యాఖ్యలు తెలుగు ప్రేక్షకులకు చిర్రెత్తుకొచ్చేలా చేశాయి. ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ మూవీ అని చెప్పడం ఒకతప్పు, అది తమిళ మూవీ అని చెప్పి మరింతగా బాధపెట్టిందని తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రాను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అంతటితో ఊరుకోలేదు తమిళ తంబీలు ప్రియాంక మీద మీమ్స్ కూడాపోస్టు చేస్తున్నారు. 20ఏళ్లుగా సినిమాలు చేస్తున్న ప్రియాంకకు తెలుగు తమిళ సినిమాల మధ్య తేడా తెలియకపోవడం దారుణమంటున్నారు.