నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji

Sivaji : దండోరా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళా సంఘాలు, సినీ ప్రముఖులు ఖండించడంతో పాటు విమెన్ కమిషన్ కి ఫిర్యాదులు కూడా చేశారు. శివాజీ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. తాజాగా దండోరా ప్రెస్ మీట్ లో మరోసారి ఈ వివాదంపై స్పందించారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, మహిళలను కించపరచడం ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చారు. అసభ్య పదాలు వాడినందుకు మాత్రం క్షమాపణ చెబుతున్నానని, […]

Published By: HashtagU Telugu Desk
Sivajii

Sivajii about samantha, nidhi

Sivaji : దండోరా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళా సంఘాలు, సినీ ప్రముఖులు ఖండించడంతో పాటు విమెన్ కమిషన్ కి ఫిర్యాదులు కూడా చేశారు. శివాజీ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. తాజాగా దండోరా ప్రెస్ మీట్ లో మరోసారి ఈ వివాదంపై స్పందించారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, మహిళలను కించపరచడం ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చారు. అసభ్య పదాలు వాడినందుకు మాత్రం క్షమాపణ చెబుతున్నానని, చాలా బాధ పడుతున్నాని అన్నారు.

దండోరా మూవీ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో హీరోయిన్‌ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులు, మహిళా సంఘాలు ఆయన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేయడంతో పాటుగా ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్'(మా)లో కూడా ఆయనపై కంప్లెయింట్ చేశారు. తన వ్యాఖ్యలపై శివాజీ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలో తాజాగా ‘దండోరా’ చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్‌మీట్‌ లో మరోసారి ఈ వివాదంపై మాట్లాడారు.

దండోరా ఈవెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై శివాజీ వివరణ ఇస్తూ.. బయటకు రాగానే తాను చేసిన తప్పును గ్రహించినట్లు తెలిపారు. అయితే హీరోయిన్‌ డ్రెస్సింగ్ ని ఉద్దేశిస్తూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేసిన శివాజీ.. మహిళలను కించపరచాలనేది తన ఇంటెన్షన్ కాదని చెప్పారు. ఆ సందర్భంలో తాను రెండు అసభ్య పదాలను వాడినందుకు మాత్రం క్షమాపణ చెబుతున్నానని, ఇప్పటికే ఆ పదాలు ఎలా మాట్లాడానో అర్థం కావడం లేదన్నారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని పేర్కొన్నారు.

30 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నడూ అలా మాట్లాడలేదని, రాజకీయాల్లోనూ ఏ రోజూ ఎవరినీ ఒక చిన్న మాట అనలేదని శివాజీ అన్నారు. ఈవెంట్‌లో ఎందుకు అలా మాట్లాడానా? అని బాధపడ్డానని చెప్పారు. ఈ రెండు పదాలు విమెన్ కమిషన్ వరకూ వెళ్లాలా? తనకంటే పెద్ద పదాలు ఇండస్ట్రీలో ఎవరూ వాడలేదా? అని ఆయన ప్రశ్నించారు. దాహం స్టేట్‌మెంట్‌కు మాత్రం కట్టుబడి ఉన్నానన్న శివాజీ.. మంచి బట్టలు వేసుకోమని చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు. అనసూయ దీంట్లోకి ఎందుకు వచ్చారు? అని అన్నారు.

  Last Updated: 24 Dec 2025, 04:14 PM IST