మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సత్య (షార్ట్ ఫిలిం ) తాలూకా సాంగ్ ను రిలీజ్ చేసారు. విరూపాక్ష , బ్రో సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు ‘సత్య ‘ అనే షార్ట్ ఫిలిం తో అభిమానుల ముందుకు వచ్చాడు.
దేశభక్తి, దేశం కోసం ఫైట్ చేసే సైనికుడిగా సాయి తేజ్ (Sai Tej) ఈ షార్ట్ ఫిలిం లో కనిపించారు. సాయి కి భార్యగా.. కాలేజీ స్నేహితురాలిగా కలర్ స్వాతి నటించింది. సోల్ ఆఫ్ సత్య (The Soul Of Satya) పేరుతో ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆకట్టుకోగా..ఈరోజు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా కాన్సెప్ట్ సాంగ్ ను విడుదల చేసారు. ఈ సాంగ్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల కావడం విశేషం.
6.15 నిమిషాల నిడివి తో ఉన్న ఈ షార్ట్ ఫిలిం మనసుకు హత్తుకునేలా ఉంది. ఓ సైనికుడు తన దేశం కోసం చేసే త్యాగాలను అలాగే మహిళలు త్యాగం చేసే తమ ప్రేమను ఈ షార్ట్ ఫిల్మ్ లో చూపించారు. మొదటి మూడు నిమిషాల పాటు ఇద్దరు భార్య భర్తల మధ్య ఉండే ప్రేమానుబంధాన్ని ఎంతో చక్కగా చూపించారు. ఆ తర్వాత అతడు ఉద్యోగ రీత్యా సైన్యంలోకి తిరిగి వెళ్లడం, ఆపరేషన్ రక్షక్ కుప్వారా అంటూ యుద్ధ పోరాటం చేసి కన్నుమూయడం, అతడిని తలుచుకుంటూ స్వాతి ఒంటరిగా బాధ పడటం, అదే సమయంలో ఓ బిడ్డను జన్మనివ్వడం వంటి సన్నివేశాలతో భావోద్వేగానికి గురి చేశారు.
మన దేశం కోసం పోరాటం చేసే ఎంతోమంది యోధులకు సంబంధించిన ఓ మంచి సందేశాన్ని తెలియజేయడానికి ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కించారు. సాయి తో పాటు అతని స్నేహితులు హర్షిత్ రెడ్డి, నవీన్ విజయ్ కృష్ణ (Naveen VK) ఈ షార్ట్ ఫిలిం లో భాగస్వాములు అయ్యారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘బలగం’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాని అందించిన నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ మ్యూజికల్ షార్ట్ ని నిర్మించగా.. నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ ఫిలిం తో సింగర్ శృతి రంజన్ మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరియర్ ప్రారభించబోతున్నారు.
Read Also : RGV Vyuham Teaser : కళ్యాణ్ ను కూడా వెన్ను పోటు పొడుస్తారు కదా