Site icon HashtagU Telugu

Pushpa: ఉ.. అంటారా! ఊఊ.. అంటారా.. ‘పుష్ప’ మూవీ రివ్యూ!

Pushpa

Pushpa

ఇండస్ట్రీలో తరచుగా కాంబినేషన్ అనే మాట వినిపిస్తుంటుంది. ముఖ్యంగా కొన్ని కాంబినేషన్స్ పేర్లు చెబితే ఒక్కసారిగా అంచనాలు పెరుగుతుంటాయి. అలా బన్నీ, సుక్కు కాంబినేషన్ కు కూడా మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కలయిలో వచ్చిన సినిమాలు సక్సెస్ కావడమే! ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? బన్నీ నటన ఏవిధంగా ఉంది? లాంటి విషయాలను తెలుసుకుందాం.

ఈ కథ 1990ల చివర్లో చిత్తూరులోని శేషాచలం అడవుల నేపథ్యంలో సాగుతుంది. పుష్పరాజ్ మార్గనిర్దేశం చేసిన పోకిరీల ద్వారా వందల టన్నుల ఎర్రచందనం దుంగలు దేశం నుండి అక్రమంగా రవాణా చేయబడతాయి. విజువల్స్ ఆర్ట్ డైరెక్టర్లు (S రామకృష్ణ, మోనికా నిగ్గోట్రే) సినిమాటోగ్రాఫర్ మిరోస్లావ్ కుబా ప్రతిభతో ప్రత్యేకంగా రూపొందాయి.

ఈ సినిమాలో అల్లు అర్జున్​కు జోడీగా రష్మిక మందాన హీరోయిన్​గా నటించింది. మళయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర చేశారు. సునీల్​, అనసూయ భరద్వాజ్​లు కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ బ్యూటీ సమంత ఓ ఐటం సాంగ్​ చేయడం కూడా సినిమాకు బలం చేకూరింది. అయితే సమంత ఐటం సాంగ్ అంతంత మాత్రమే అని అంటున్నారు.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లు అర్జున్ పుష్పరాజ్​గా కనిపించారు. ఫహాద్ ఫాజిల్​ భన్వర్​సింగ్ శెఖావత్​గా నటించారు. సినిమాలో ఎక్కువ భాగం అడవుల్లోనే ఉంటుంది. అల్లు అర్జున్ సహా దాదాపు అన్ని క్యారెక్టర్లు ఈ సినిమాలో డీ గ్లామరెస్​గా కనిపిస్తాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే.. పుష్ప ఔట్ స్టాండిగ్​ అంటూ బెనిఫిట్ షో చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. అల్లు అర్జున్​ (Allu Arjun) చేసిన సినిమాలన్నింటితో పోలిస్తే.. ఇందులో నటన మరో స్థాయిలో ఉందంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. మొదటి భాగం కన్నా సెకండాఫ్​ బాగుందంటూ చెబుతున్నారు.

దర్శకుడు సుకుమార్ పుష్ప రాజ్ ఎదుగుదలను మరింత కన్విన్సింగ్‌, చమత్కారంగా రాయాల్సి ఉంది. అయితే పుష్పరాజ్ తన తోటి కూలీల కదలికలను ఎలా నిర్దేశిస్తాడు? అతను ఆధిపత్యాన్ని ఎలా ప్రదర్శిస్తాడు? లాంటివి వాటికి సమాధానం దొరకదు. అయితే ఇటీవలి కాలంలో అత్యంత ఆకర్షణీయమైన మాస్ మసాలా చిత్రాల్లో ఇది ఒకటి. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు ఈ సినిమాకు ఫ్లస్ పాయింట్ చెప్పొచ్చు.

Cast: Allu Arjun, Sunil, Ajay Ghosh, Rashmika & others

Director: Sukumar B

Run-Time: 179 minutes

Rating: 3/5

Exit mobile version