దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడానికి రేవంత్ ప్రభుత్వమే (Revanth Govt) కారణమని ఆరోపించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR). యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ (Devara) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Devara Pre Release Event) రద్దు కావడం తో అభిమానులు తీవ్ర నిరాశకు గురి కావడమే కాదు.. మేకర్స్ సైతం నిరాశ వ్యక్తం చేసారు. ఎన్టీఆర్ అయితే స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేసి తాను ఎంతో బాధపడుతున్నట్లు తెలిపాడు. ఇక ఈవెంట్ ను చూడాలని , ఎన్టీఆర్ మాటలను వినాలని , సినిమా విశేషాలను తెలుసుకోవాలని తెలుగు రాష్ట్రాల నుండే కాదు ఇతర రాష్ట్రాలనుండి కూడా పెద్ద ఎత్తున అభిమానులు హైదరాబాద్ కు చేరుకున్నారు.
ఉదయం నుండి హైదరాబాద్ నోవాటెల్ ముందు పడిగాపులు కాసారు. వందలు కాదు వేల సంఖ్యలో అభిమానులు చేరుకోవడం తో చివరి నిమిషంలో ఈవెంట్ నిర్వాహకులు సెక్యూరిటీ రీజన్స్ తో రద్దు చేసారు. నిర్వాహకులు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఓపెన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో అందరూ శిల్ప కళా వేదికలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేస్తారని అనుకున్నారు. కానీ మేకర్స్ అనూహ్యంగా హోటల్ నోవొటెల్ లో ఏర్పాటు చేసారు. అందువల్ల సెక్యూరిటీ కారణాల చేత ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేయాల్సి వచ్చింది. అయితే ఈ ఈవెంట్ రద్దు కావడం వెనుక ప్రభుత్వ నిర్లక్షమే అని అన్నారు కేటీఆర్.
గతంలో తమ ప్రభుత్వం హైదరాబాద్ లో సినిమా ఫంక్షన్లకు ఇబ్బంది లేకుండా చూసిందని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని కేటీఆర్ విమర్శించారు. ‘ ఎన్టీఆర్ సినిమా దేవర ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వహించేందుకు ఔటోర్లో అనుమతి ఇవ్వలేదు. చివరికి ఈవెంట్ రద్దు చేసుకునే పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ట్రాఫిక్ నియంత్రణకు కూడా సరైనా చర్యలు లేవు. అన్నింటినీ నగరవాసులు గమనిస్తున్నారు’ అని కేటీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం వల్ల ప్రతి ఒకరు బాధపడుతున్నారని పేర్కొన్నారు.
Read Also : Navratri 2024: నవరాత్రుల సమయంలో కొబ్బరికాయ తమలపాకును పూజిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?