ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘రాజా సాబ్’ (Raaja Saab). మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా..తాజాగా ప్రభాస్ తాలూకా ఓ పిక్ లీక్ అయ్యింది. ఈ ఫొటోలో ప్రభాస్ క్యాజువల్ చెక్స్ షర్ట్‌లో, స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్నారు. ఫొటో క్వాలిటీ తక్కువగా ఉన్నప్పటికీ, ప్రభాస్ కటౌట్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీనికి తోడుగా అభిమానులు ఆ లుక్‌ను ఆధారంగా చేసుకుని ఏఐ (AI) టెక్నాలజీ ద్వారా పోస్టర్ తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Harish Rao : నీ అనుచరుల కోసమే అందాల పోటీలు పెట్టావా..?
ఈ సినిమా నుంచి గతేడాది చిన్న గ్లింప్స్ మాత్రమే విడుదలైందే తప్ప, ఇతర ప్రమోషనల్ కంటెంట్ మాత్రం రాలేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల నిర్మాత ఎస్‌కేఎన్ టీజర్ త్వరలోనే వస్తుందనే సంకేతం ఇచ్చారు. అయితే తాజాగా లీకైన లుక్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. టీజర్ ఆలస్యం అవుతున్న తరుణంలో ఈ లుక్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో #RajaSaab Look, #Prabhas Trend వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. సినిమా డిసెంబర్ 5న విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతున్నా, అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.
ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజా సాబ్‌తో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, అలాగే ‘సలార్ 2’, ‘కల్కి 2898 AD’ సీక్వెల్స్‌లోనూ ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రాలన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. ‘రాజా సాబ్’ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్ వంటి తారాగణం నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఓ ట్రెండ్ సెటర్‌గా మారింది. టీజర్ విడుదలైతే ఇది ఇంకెంత స్థాయికి చేరుతుందో చూడాలి.
The RajaSaab 🔥🦖 pic.twitter.com/wC785fE5G1
— FAN (@REBEL_WOOD1) May 31, 2025