ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ (The RajaSaab) సినిమా నుంచి మేకర్స్ తాజాగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్(New Poster)లో మంటలు అంటుకున్న సింహాసనం తలకిందులుగా చూపించబడింది. ఇది సినిమాలో వచ్చే ఇంటెన్స్ సన్నివేశాలను సూచిస్తుంది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు 50శాతం పూర్తి చేసుకుంది. రేపు ప్రభాస్ బర్త్ డే సందర్బంగా చిత్ర టీజర్ ను విడుదల కానున్నట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో టీజీ విశ్వప్రసాద్ (TG Vishwaprasad) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సలార్ , కల్కి బస్టర్ విజయాల తర్వాత ప్రభాస్ బర్త్ డే రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ గ్రాండ్ గా వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజునే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల అప్‌డేట్స్ వచ్చే అవకాశాలూ కనిపిస్తున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో నటించనున్న నూతన చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడుగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్న ‘స్పిరిట్’ కూడా జనవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం. ఇలా వరుస సినిమాలు లైన్లో పెట్టాడు ప్రభాస్.
Read Also : PM Modi : రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ