ప్ర‌భాస్ రాజాసాబ్‌.. పార్ట్‌-2 పేరు ఇదేనా?!

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటించారు.

Published By: HashtagU Telugu Desk
The Raja Saab Sequel

The Raja Saab Sequel

The Raja Saab Sequel: పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రం భారతదేశవ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్లతో గ్రాండ్‌గా విడుదలైంది. అయితే తెలంగాణలో మాత్రం ఈ సినిమా విడుదల విషయంలో చివరి నిమిషం వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టికెట్ ధరల పెంపునకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు పెండింగ్‌లో ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యమైన విష‌యం తెలిసిందే.

సీక్వెల్ ఖరారు.. ‘ది రాజా సాబ్ 2: సర్కస్ 1935’

దర్శకుడు మారుతి ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని గతంలోనే హింట్ ఇచ్చారు. తాజాగా ఈ రెండో భాగానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ‘ది రాజా సాబ్’ సీక్వెల్‌కు “ది రాజా సాబ్ 2: సర్కస్ 1935” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌ను బట్టి చూస్తుంటే సినిమా కథ 1930వ దశకం నాటి పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో సర్కస్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘సలార్ 2’, ‘స్పిరిట్’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ సీక్వెల్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: లివర్ సరిగ్గా పనిచేయాలంటే..లివర్ ఆరోగ్యాన్ని పెంచే బెస్ట్ డ్రింక్స్..టాక్సిన్లు క్లీన్

చిత్ర యూనిట్- నిర్మాణ వివరాలు

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటించారు. బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇది ఒక హారర్-కామెడీ, ఫాంటసీ ఎంటర్‌టైనర్. ప్రభాస్‌ను సరికొత్త వింటేజ్ లుక్‌లో చూసిన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మారుతి మార్క్ కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

  Last Updated: 09 Jan 2026, 12:19 PM IST