Producer Satires On YCP: వైసీపీపై సెటైర్లు వేసిన బేబీ మూవీ నిర్మాత‌.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌..!

  • Written By:
  • Updated On - June 24, 2024 / 03:40 PM IST

Producer Satires On YCP: ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ప‌లువురు గ‌త ప్ర‌భుత్వం వైసీపీపై ఊహించ‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌కి చెందిన చాలామంది ప్ర‌ముఖులు మీడియా ముఖంగానే వైసీపీపై, మాజీ సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. టాలీవుడ్‌కి చెందిన చాలా మంది నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, న‌టీన‌టులు ఎన్నిక‌లకు ముందు జ‌న‌సేన లేదా టీడీపీ త‌రుపున ప్ర‌చారం చేశారు. అయితే ఆ స‌మ‌యంలో వారిపై వైసీపీ ముఖ్య నేత‌లంద‌రూ ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడారు. ఇప్పుడు అధికారం మారడంతో టాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ నిర్మాత‌లు వైసీపీపై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ ఈవెంట్‌లో బేబీ మూవీ నిర్మాత శ్రీనివాస కుమార్‌ ఇండెరైక్ట్‌గా వైసీపీపై (Producer Satires On YCP) చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఆ వీడియోలో బేబీ మూవీ నిర్మాత ఎస్కేఎన్ ఏం మాట్లాడారంటే.. అన్న‌య్య పెట్టాడు దండం త‌మ్ముడు పెట్టాడు పిండం న‌మ‌స్కారానికి ప్ర‌తి న‌మ‌స్కారం సంస్కారం ఆ న‌మ‌స్కారం చేత‌కానివాళ్ల‌కి ప్ర‌జ‌లు ఇస్తారు ఇలాంటి తిరస్క‌రం తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సింహ‌సనం మీద కూర్చునే అర్హ‌త మా అన్న‌య్య ఇంద్ర‌సేనుడిది అలాగే రాజ‌కీయాల్లో సింహ‌సానాన్ని మార్చేసే ప‌వ‌ర్ జ‌న‌సేనుడిది/సో విజ‌యం వ‌చ్చింద కాదా అని వీర‌వీగితే పాత త‌పాలా పేసుల‌కి మ‌న‌కి తేడా ఉండ‌దు సో అందుక‌ని అంద‌ర్నీ సోద‌రులా భావిస్తూ రాష్ట్రాభివృద్ధికి అంద‌రూ తోడ్ప‌డాలి అలాగే ఎవ‌రీ మీదో కోపం వ‌స్తే టికెట్లు రేట్లు త‌గ్గించేసి సినిమా థియేట‌ర్ల‌లో బ‌య‌ట ఎమ్మార్వోల చేత ఆర్వోల చేత కాకుండా ఇప్పుడు సినీ ప‌రిశ్ర‌మ‌కి మంచి చేయాల‌నుకునే ప్ర‌భుత్వం వ‌చ్చింది అన్నారు.

Also Read: Kalki 2898 AD : కల్కి మొదటి రోజు కలెక్షన్‌ టార్గెట్‌ ఎంత..?

అంతేకాకుండా ఇలాంటి ప్ర‌భుత్వం సుస్థిరంగా ఉండాల‌ని తెలుగు చ‌ల‌నచిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎంతో మేలు చేకూరాల‌ని కోరుకుంటున్నాం అలాగే విజ‌యం వ‌చ్చిన త‌ర్వాత అంద‌రూ విజ‌యం వెన‌క మేము ఉన్నాం మేము ఉన్నామ‌ని చెబుతారు విజ‌యం రాక ముందు నుంచి విశ్వ‌ప్ర‌సాద్ గారు జ‌న‌సేన క్యాంపెయిన్‌లోనూ విరివిగా పాల్గొంటూ అల‌య‌న్స్‌కు అండ‌గా నిలిచారు సో ఆయ‌న‌కి కూడా శుభాకాంక్ష‌లు సార్ అంటూ మాట్లాడిన మాట‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

We’re now on WhatsApp : Click to Join