Site icon HashtagU Telugu

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్క‌డ‌?

Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)పై అభిమానుల అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ 2025 జూన్ 12 తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్ వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.

జ్యోతి కృష్ణ దర్శకత్వంలో, నిర్మాత ఏఎమ్ రత్నం సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం 17వ శతాబ్దం మొఘల్ కాలంలో సాగే కథనంతో తెరకెక్కుతోంది. పవన్ కల్యాణ్ యోధుడు వీరమల్లు పాత్రలో నటిస్తున్నారు. మొఘల్ రాజుల నుంచి కోహినూర్ వజ్రాన్ని చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉన్న ధైర్యవంతుడైన బందిపోటుగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, హాలీవుడ్ నిపుణులైన వీఎఫ్ఎక్స్, యాక్షన్ డైరెక్టర్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం విశేషం.

Also Read: IPL 2025 Final: ఐపీఎల్ 2025.. ఫైన‌ల్ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఇదే!

తాజా సమాచారం ప్రకారం.. ‘హరిహర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగనుందని తెలుస్తోంది. ఈ ఈవెంట్ వివరాలు ఇటీవల వెల్లడయ్యాయి. అయితే ఖచ్చితమైన తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గతంలో మొదటి ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో మే 21, 2025న జరిగింది. ఇందులో హీరోయిన్ నిధి అగర్వాల్, దర్శకుడు జ్యోతి కృష్ణ, నిర్మాత ఏఎమ్ రత్నం, మూవీ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ సాధారణంగా ప్రమోషనల్ ఈవెంట్లకు హాజరు కాకపోయినప్పటికీ ఈ భారీ పాన్-ఇండియా చిత్రం కోసం ఆయన హాజరయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. తాజాగా మూవీ యూనిట్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ క్రీడా మైదానంలో ఈ నెల 8న వేడుక నిర్వహించనున్నారు. 7వ తేదీన పవన్‌ కల్యాణ్‌ తిరుపతికి చేరుకోనున్నారు.