Site icon HashtagU Telugu

Seize The Ship : ‘సీజ్ ద షిప్’ పేరిట మూవీ టైటిల్

Seize The Ship

Seize The Ship

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) నోటి వెంట వచ్చిన మాట ఇప్పుడు ఓ సినిమాకు టైటిల్ గా మారింది. తాజాగా కాకినాడ పోర్టు(Kakinada Port
)లో బియ్యం తరలింపు (Movement of Rice) కోసం సిద్ధమైన పనామా దేశానికి చెందిన ‘స్టెల్లా ఎల్‌’ (‘Stella L’)అనే షిప్‌ను సీజ్‌ చేయాలంటూ పవన్‌ కళ్యాణ్‌ ఆదేశించిన తర్వాత ‘సీజ్‌ ద షిప్‌’ అనే మాట ట్రెండ్ అయినా సంగతి తెలిసిందే. సోషల్ మీడియా లో అయితే ‘సీజ్‌ ద షిప్‌’ అనే డైలాగ్ విపరీతంగా చక్కర్లు కొడుతుంది.

అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్ మూవీ లో పవన్ ట్రెండ్ ఫాలో అవ్వను..ట్రెండ్ సెట్ చేస్తా అని అన్నాడో..ఇప్పుడు అదే రీతిలో అధికారులతో నవ్వుతూనే ‘సీజ్‌ ద షిప్‌’ అంటూ డైలాగ్ పేల్చాడు. పోర్టు ఉన్నది స్మగ్లింగ్ చేసుకోవడానికా… మీ బాస్ కు తెలుసా… ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడో? ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం అంటూ నౌక సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత మంత్రులకు భిన్నంగా స్పాట్ లోనే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా పవన్ తన ప్రత్యేకతను చాటుకున్నారు.

ఇక ఇప్పుడు ఈ డైలాగ్ తో తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఓ సినీ నిర్మాత రూ.1100 చెల్లించి ‘సీజ్ ద షిప్’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్నారు. ఇది ఇప్పుడు ఫిలిం సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది కదా పవన్ క్రేజ్ అంటే అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

Read Also : CM Chandrababu : రేపు ముంబైకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు