Site icon HashtagU Telugu

Family Star: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎన్టీఆర్ బదులు?

Mixcollage 03 Feb 2024 08 48 Am 8942

Mixcollage 03 Feb 2024 08 48 Am 8942

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే విజయ్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుండి రిలీజైన గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 5 నప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఫ్యామిలీ స్టార్ మూవీ నిజానికి సంక్రాంతికి విడుదల కావాల్సింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో పండక్కి రాలేకపోయింది. ఆ తర్వాత ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ చేయాలనుకున్నా అదే డేట్‌లో ఎన్టీఆర్ దేవర మొదటి పార్ట్ రిలీజ్ చేస్తామని ఆ సినిమా టీమ్ ప్రకటించారు. దాంతో ఫ్యామిలీ స్టార్ వెనక్కి తగ్గింది. దేవర వాయిదా పడితే అదే డేట్‌కి ఫ్యామిలీ స్టార్ తీసుకురావాలని దిల్ రాజు ప్లాన్ చేసారు.

 

అనుకున్నట్లే ఏప్రిల్ 5 కి ఫ్యామిలీ స్టార్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిని బట్టి దేవర మూవీ వాయిదా పడినట్టే అని అర్థమవుతుంది. ముందు నుంచి అనుకున్నట్టుగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆలస్యమవడంతో దేవర ఏప్రియల్ రిలీజ్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 5 ఫ్యామిలీ స్టార్ రిలీజ్ వార్తతో విజయ్ దేవరకొండ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరి నిజంగానే ఏప్రిల్ 5న దేవర సినిమా విడుదల కాదా ఈ విషయంపై క్లారిటీ రావాలి అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.