The last wish of a fan is to die after watching Devara movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ గా కోట్లలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అంటే ప్రాణాలు ఇచ్చే అభిమానులు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు వచ్చిన..ఎన్టీఆర్ నుండి సినిమా వచ్చిన అభిమానులు పెద్ద పండగల భావిస్తారు. థియేటర్స్ ను ముస్తాబు చేయడం , భారీగా ప్లెక్సీలు , కటౌట్స్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. ఇదిలా ఉంటె ఎన్టీఆర్ వీరాభిమాని తన చివరి కోరిక దేవర సినిమాలు చూడాలని..ఆ సినిమా చూసి చనిపోతానంటూ తెలుపడం అందర్నీ కంటతడి పెట్టిస్తుంది.
పూర్తి స్టోరీ లోకి వెళ్తే..
కౌశిక్ (19 )..అనే కుర్రాడు..ప్రస్తుతం బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కౌశిక్ తండ్రి శ్రీనివాసులు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తిరుపతిలో నివాసం ఉంటారు. కాగా కొద్దీ రోజులుగా కౌశిక్ అనారోగ్యం తో బాధపడుతున్నారు..సంపాదించినదంతా కొడుకు ఆరోగ్యం కోసం ఖర్చు చేశారు. చివరకు కూడ బెట్టుకున్న ఆస్తులను సైతం అమ్మేశారు. దేవర సినిమా విడుదలైన వరకు తన కొడుకును బతికించమని ఆ తల్లి మీడియా ఎదుట కోరుకుంది. ట్రీట్‌మెంట్ చేయాలంటే ఒక్కో ఇంజెక్షన్ మూడు లక్షల రూపాయలని, అలాంటివి 12 ఇంజెక్షన్లు చేయాలని డాక్టర్లు అన్నట్లు చెప్పుకొచ్చారు. దేవర (Devara) సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చనిపోయే ముందు తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా చూడాలన్నది కౌశిక్ కోరిక. అప్పటివరకు తన కొడుకును బతికించాలంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ట్రీట్‌మెంట్‌కు 60 లక్షలు అవుతుందని, దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ఎన్టీఆర్ , దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా తెరెక్కుతున్న ‘దేవర’ ఈ నేల 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ వర్క్స్ స్పీడ్ అందుకున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే థియేటర్లో పూనకాలే అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
Read Also : MLA Kaushik Reddy House Arrest : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గృహనిర్బంధం