Site icon HashtagU Telugu

KGF Hero: బాలీవుడ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన కేజీఎఫ్ హీరో, అసలు మ్యాటర్ ఇదే!

Yash

Yash

ప్రస్తుతం రామాయణం, మహాభారత్ లాంటి కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేస్తుండగా, బాలీవుడ్ లో నితీష్ తివారీ డైరెక్షన్ లో మరో మూవీని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే రావణ్‌ పాత్రకు కేజీఎఫ్ ఫేం రాకింగ్ స్టార్ యష్‌ (Yash) ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. రణబీర్ కపూర్, అలియా భట్ రాముడు, సీతా దేవిగా నటించడానికి ఒకే చెప్పారు. అయితే కేజీఎఫ్ హీరో యశ్ మాత్రం రావణ్ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడట.

ఫిలింఫేర్ నివేదికల ప్రకారం.. యష్ ఐకానిక్ పాత్రలో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్నప్పటికీ, ఆయన టీం (Yash Team) వ్యతిరేకంగా ఈ సినిమా చేయొద్దని సలహా ఇచ్చింది. ఎక్కువ మంది బాలీవుడ్ ప్రాజెక్ట్‌ (Bollywood)లో భాగం కాకూడదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ కన్నడ సూపర్ స్టార్ కు బాలీవుడ్ అంతగా సేఫ్ కాదని సూచింనట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ ఆఫర్ ను యష్ తిరస్కరించినట్లు తెలియడంతో ఆయన అభిమానులు, నెటిజన్స్ “చాలా మంచి నిర్ణయం. 5 సంవత్సరాల నుండి బాలీవుడ్ సినిమాలు చూడటం లేదు’’ అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఆదిపురుష్ (Adipurush) సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తుండటం, పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతుండటంతో మళ్లీ అలాంటి సినిమాలో నటించడం హీరో యశ్ కు ఇష్టం లేదట. అందుకే బాలీవుడ్ ను ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు కన్నడ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం, పూరితో తొలి పరిచయం!

Exit mobile version