Big Boss :టెలివిజన్ షోస్ లో బిగ్ బాస్ షో ది ప్రత్యేక స్థానం..! ఈ సీజన్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ .. చాలా వెయిట్ చేస్తుంటారు. మొదట హిందీలో స్టార్ట్ అయిన ఈ రియాలిటీ షో…! అందరిని ఆకట్టుకునే విధంగా అన్ని భాషలలోను పెద్ద స్టార్స్ ని హోస్ట్ గా పెట్టుకొని నిర్వహిస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం.
తెలుగులో ఇప్పటికే 7 సీజన్స్ ముగించుకుంది ఈ షో, మొదట హోస్ట్ గ తారక్ వ్యవహరించగా…! రెండో సారి ఆ బాధ్యతలు నాని..! ఇక మిగిలిన అన్ని 4 సార్లు కింగ్ నాగార్జున తీసుకున్నారు. తిరిగి 8 సీజన్లో నాగ్ హోస్ట్ గ ఉంటారు అని ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమో తో స్పష్టమైంది. తెలుగు తో పాటు తమిళ్ లో కూడా 7 సీజన్స్ ముగించుకుంది. ఈ షోకి చాల వరకు లోకనాయకుడు కమల్ హాసన్ ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల కమల్ 8 సీజన్ హోస్ట్ గ తాను ఉండట్లేదు అని కమల్ తెలపటంతో ఎవరా బాధ్యత తీసుకుంటారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బిగ్ బాస్ యాజమన్యం కూడా గట్టిగానే వేటాడి చివరకు ఒక పెద్ద స్టార్ నే పట్టుకున్నారు అని, అతనే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అని, సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. కమల్ స్థానానికి సేతుపతి ఎంత వరకు న్యాయం చేయగలడో తెలీదు కానీ. ఈ సెలక్షన్ తో ఫ్యాన్స్ మాత్రం హ్యాపీ గానే ఉన్నారు. ఇక దీని గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.