The Kerala Story: హమ్మయ్య ఎట్టకేలకు ఓటీటీలో విడుదల కాబోతున్నది కేరళ స్టోరీ.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

ప్రస్తుత రోజుల్లో థియేటర్లలోకి విడుదల అవుతున్న సినిమాలు కనీసం నెలరోజులు కూడా కాకముందే అప్పుడే ఓటీటీ లోకి విడుదల అవుతున్నాయి. ఇంకొన్ని సినిమాల

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 10:00 AM IST

ప్రస్తుత రోజుల్లో థియేటర్లలోకి విడుదల అవుతున్న సినిమాలు కనీసం నెలరోజులు కూడా కాకముందే అప్పుడే ఓటీటీ లోకి విడుదల అవుతున్నాయి. ఇంకొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. మరికొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయి కొన్ని నెలలు అవుతున్నా ఓటీటీలోకి రావడం లేదు. అయితే అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కేరళ స్టోరీ సినిమా కూడా ఒకటి. బాలీవుడ్ లో గత ఏడాది విడుదల అయిన ది కేరళ స్టోరీ మంచి విజయాన్ని అందుకుంది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది.

కేరళ స్టోరీ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అదే రేంజ్ లో విమర్శలు కాంట్రవర్సీలను కూడా ఎదుర్కొంది. ఇంకా చెప్పాలంటే విడుదల అయిన తరువాత కొన్ని ప్రదేశాలలో ఈ సినిమాను బ్యాన్ చేసేసారు. అయినప్పటికీ ఈ సినిమా తగ్గకుండా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితం అవుతూ కోట్లలో కలెక్షన్స్ లో రాబట్టింది. అయితే ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు ఏడాది పూర్తి కావస్తున్నా కూడా ఇంకా ఓటీటీ లోకి ఇంకా విడుదల అవ్వలేదు. కేరళ స్టోరీ సినిమా విడుదలై చాలా కాలం అయినా ఇప్పటి వరకు ఓటీటీలోకి రాలేదు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు మూవీ మేకర్స్ ప్రేక్షకులకు చక్కని శుభవార్తను తెలిపారు.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చింది. ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ కేరళ స్టోరీ సినిమాను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ జీ 5 ఈ చిత్రాన్ని ఈ ఫిబ్రవరి 16న తీసుకొస్తున్నట్టుగా ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుంటుందో చూడాలి మరి. థియేటర్లలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.