Site icon HashtagU Telugu

Sana Khan: గర్భవతైన నటి సనాఖాన్ ను లాక్కెళ్తున్న భర్త.. అసలు విషయం తెలుసుకోకుండా ఫైర్ అవుతున్న నెటిజన్స్!

Sana Khan

Sana Khan

కొన్ని కొన్ని సార్లు ఏం జరగకున్నా కూడా చూసే దాని పట్ల అక్కడ ఏదో జరుగుతుందన్నట్లుగా ఉంటుంది. అలా కొన్ని సందర్భాలలో అవి తప్పుగా కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ జనాలు మాత్రం అసలు ఏం జరిగిందో ఏమో తెలుసుకోకుండా తమకు నచ్చినట్లు ఊహించుకుంటూ తప్పు పడుతూ ఉంటారు. అయితే తాజాగా ఒక నటికి సంబంధించిన వీడియో పట్ల కూడా నెటిజన్స్ అలాగే రియాక్ట్ అవుతున్నారు. ఇంతకు ఆ నటి ఎవరు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి సనా ఖాన్. ఒకప్పుడు ఈమె నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ షో లో కనిపించి ఆ తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసింది. ఇక ఈమెకు 2020లో ముఫ్తీ అనాస్ సయ్యద్ తో పెళ్లి జరగగా.. ఈ ఏడాది ఆమె గర్భం దాల్చింది. ఇక ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది.

అయితే ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులంతా పండగ సంబరంలో ఉన్నారు. ఈ సందర్భంగా నటి సనా కూడా తన భర్త అనాస్ తో కలిసి ముంబైలో బాబా సిద్ధిక్ యొక్క ఇఫ్తార్ వేడుకకు హాజరయ్యింది. అయితే దానికి సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయింది.

అందులో తన భర్త తనను లాగుతూ తీసుకెళ్ళుతున్నట్లు కనిపించడంతోపాటు.. నేను అలసిపోయాను నేను నడవలేను అని ఆమె చెప్పినట్లు కూడా వినిపించింది. దీంతో ఆ వీడియో చూసి అందరూ అతనిపై ఫైర్ అయ్యారు. గర్భవతి అయిన భార్యతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ బాగా ఫైర్ అయ్యారు. దీంతో ఈ వీడియో పట్ల విమర్శలు రావడంతో వెంటనే సనా స్పందించింది. తాను ఎక్కువసేపు నిలబడి ఉండటంతో చెమటలు పట్టడంతో అలసిపోయానని.. అందుకు తన భర్త తనకు స్వచ్ఛమైన గాలి అందించటం కోసం హడావుడిగా కారు వద్దకు తీసుకెళ్లాడు అని తెలిపింది.